Animal Movie: సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ మూవీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆల్ఫా మేల్ క్యారెక్టర్ లో బోల్డ్ అండ్ వైల్డ్ గా రణబీర్ ని చూపించాడు సందీప్. ఈ సినిమాలో హీరో నటనకు మంచి గుర్తింపు కూడా లభించింది. ఈ మూవీ యూత్ కి విపరీతంగా నచ్చడంతో బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు వెయ్యు కోట్ల వరకు వసూల్ చేసి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
కానీ ఈ మూవీ రిలీజ్ అయిన రోజు నుండి కలెక్షన్ల పరంగా దూసుకుపోయినప్పటికీ.. పలువురు మాత్రం ఈ చిత్రంపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమని కామెంట్ చేసింది? అసలు ఆమె పోస్ట్‌కి , యానిమల్ మూవీకి సంబంధం ఏంటని నెట్టింట తెగ చర్చ నడుస్తోంది.
కాంట్రవర్శీ వెర్సెస్ కలెక్షన్లు
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి సినిమాలు తీసిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ యానిమల్(Animal). ఈ మూవీని చూసిన కొంతమంది మూవీ సూపర్ అంటే, కొంతమంది మాత్రం మహిళలను తక్కువ చేసి చూపించారని ఫైర్ అయ్యారు. సినిమాలో హింస, అసభ్యకరమైన సంభాషణలు ఎక్కువగా ఉన్నాయని.. సమాజానికి ఏం చూపించాలని అనుకుంటున్నారు అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. అంతేనా ఈ సినిమా సెగ పార్లమెంట్ వరకు వెళ్లింది.
ఈ సినిమా చుట్టు ఇంతా జరుగుతున్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం రణ్‌బీర్ నటను ఫిదా అయిపోయారు. ఓవైపు అగ్రెసివ్ గా చూపిస్తూనే.. మరోవైపు తండ్రిపై చెప్పలేనంత ప్రేమ చూపించే కొడుకుగా అద్భుతంగా నటించాడు. అలా యాంగ్రీ, రొమాన్స్, ఎమోషన్స్ అన్నీ కలిపిందే సినిమా అని.. మూవీని మూవీలా చూడాలంటూ యూత్ మొత్తం సపోర్ట్ చేశారు. ఏదేమైనా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపించి, సెన్సేషనల్ హిట్ అయిన ఈ మూవీ ఇటీవల ఓటిటీలో అడుగుపెట్టింది.
( దీనిపై ఓ లుక్కేయండి: బోల్డ్ సీన్లలో నటించమన్నాడు.. నాకు భయమేసేది: నటి మీనా )
అసలు ఏ మూవీ అది
ఈ తరుణంలో సీనియర్ నటి రాధిక చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా రాధిక ఓ మూవీ చూసి.. ఇది ఓ సినిమానైనా, చెత్త సినిమా, అసహ్యం వేసిందని, ఇదేం సినిమా అని ఫైర్ అవుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కానీ పేరు ప్రస్తావించకుండా రాధిక చేసిన కామెంట్స్ ఏ మూవీ మీద అన్నది మాత్రం క్లారిటీ లేదు.
అయితే యానిమల్ (Animal)మూవీ ఓటిటిలో రిలీజ్ అయిన రోజే రాధిక ఇలా పోస్ట్ పెట్టడంతో.. చాలా మంది యానిమల్ మూవీ చూసే రాధిక అలా కామెంట్ చేశారంటూ నెట్టింట చర్చ జరుగుతోంది. గతంలో ధియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శిస్తున్నప్పుడు ఈ తరహా కామెంట్లు కొందరి నుంచి వినిపించింది. ఈ నేపథ్యంలో ఓటీటీలో వచ్చాక కూడా యానిమల్ పై వార్తలు వస్తున్నాయి. మరి కొంతమంది మాత్రం వేరే మూవీ అయినా కావచ్చని, పేరు ప్రస్తావించలేదు కదా అని అభిప్రాయపడుతున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం ఈ సినిమా ఏది అయ్యింటుందని జుట్టు పీక్కుంటున్నారు.