Anupama Parameswaran: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచమైంది. శతమానం భవతి చిత్రంతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించడంతో పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా యూత్‌లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ కేరళ కుట్టి. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ని సాఫీగా సాగిస్తోంది అనుపమ.
ప్రస్తుతం డీజే టిల్లు 2 సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా పెళ్లి చీరలో సోషల్ మీడియాలో దర్శనమిచ్చి అటు ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చింది.
(( దీనిపై ఓ లుక్కేయండి: అందాలతో పిచ్చేక్కిస్తున్న బ్యూటీ .. అవార్డ్ ఫంక్షన్లో అందరి చూపు అటే! ))
సడన్ షాక్కిచ్చిన కేరళ కుట్టి
ప్రేమమ్ చిత్రంలో చిన్న పాత్ర పోషించినప్పటికీ అందులో తన అందం, నటనతో కుర్రకారుకి పిచ్చేక్కించింది అనుపమ(Anupama Parameswaran). దీంతో ఆ తర్వాత వరసగా ఈ అమ్మడుకి ఆఫర్లు వచ్చాయి. ప్రత్యేకంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ గుర్తింపు మాత్రం లభించింది. ఇక అప్పటి నుంచి సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ కెరీర్‌ను సాగిస్తోంది అనుపమ.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. తన ఫాలోవర్స్‌ను అలరిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కనువిందు చేస్తుంటుంది. వీటితో పాటు మధ్య మధ్యలో తాను చేస్తున్న సినిమాలోని పాత్రలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
ఎందుకిలా చేశావ్ అనుపమ..!
రామ్, నాగ చైతన్య, నాని,నిఖిల్ వంటి యంగ్ స్టార్స్‌తో జతకట్టింది. వీటితోపాటు తమిళ, కన్నడ మూవీస్‌లోనూ నటించింది. ఈ రకంగా అనుపమ కెరీర్ సాఫీగా సాగుతుండగా.. అందరూ షాకయ్యేలా ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో క్రికెటర్ బూమ్రాతో లవ్‌లో ఉందంటూ పుకార్లు రాగా.. అతనికి వివాహం కాగానే అనుపమ పెళ్లి గురించి ఎలాంటి గాసిప్స్ మళ్లీ తెరపైకి రాలేదు.
కానీ తాజాగా పెళ్లి చీరతో మెడలో తాళిబొట్టుతో అనుపమ ప్రత్యక్షమైంది. ఈ ఫోటోలని తన ఇన్ స్టాలో షేర్ చేసింది. దీంతో ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుందా అని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. దీనిపై నెట్టింట రచ్చ కూడా మొదలుపెట్టేశారు.
అయితే అందరికీ ట్విస్ట్ ఇస్తూ ఈ ఫోటో తమిళ సినిమా’సైరన్’లోని ఓ పాట కోసం ఫోటో షూట్ చేసిన లుక్ అని క్లారిటీ వచ్చేసింది. కాగా మాస్ మహారాజ రవితేజతో ఈగల్, సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న టిల్లు స్కైర్ వంటి సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఈ క్లారిటీ రావడంతో ఈ పిక్‌తో సడన్ షాక్ ఇచ్చావ్, ఎందుకిలా చేశావ్ అనుపమ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.