Eagle Twitter Review: మాస్ మహారాజా రవితేజ కొత్త లుక్‌లో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందించిన చిత్రం ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా ఇందులో కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో భారీ అంచనాలు ఏర్పడ్డ ఈగల్ ఎట్టికేలకు శుక్రవారం (ఫిబ్రవరి 9) థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
ఆల్రెడీ ఓవర్సీస్లో పలుచోట్ల ఈ సినిమా షోలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల ఫ్యాన్స్ ఈగల్ సినిమాను చూసేశారు. దీంతో ఈ చిత్రాన్ని చూసిన ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎన్నో అంచనాలు మధ్య విడుదలైన ఈగల్ (Eagle)మూవీ ఎలా ఉందన్న విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చలు మొదలయ్యాయి. అవేంటో ఒకసారి లుక్కేద్దాం… నెట్టింట వస్తున్న రిపోర్టులను చూస్తే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినట్లే కనిపిస్తోంది.
((దీనిపై ఓ లుక్కేయండి: నిర్మాతలకు ఇలానే చెబుతా.. రెమ్యునరేషన్ పెంపు వార్తలపై అదిరిపోయే రిప్లై!))
ఓ నెటిజన్ ఇలా రాసుకొచ్చాడు.. ఈగల్ మూవీలో చాలా మాసీ సన్నివేశాలు ఉన్నాయని, ప్రత్యేకంగా బీ సీ సెంటర్లలో పిచ్చెక్కిపోయే షాట్స్ ఉన్నాయని తెలిపాడు. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్, అమ్మవారి హ్యాండ్స్ నుంచి తుపాకీ జారడం, యాక్షన్ సీక్వెన్స్‌లో గన్నుతో సిగరెట్‌ను వెలిగించుకోవడం వంటి సన్నివేశాలు థియేటర్ నుంచి బయటకు వచ్చినా ఇంకా మైండ్‌లోనే తిరుగుతున్నాయని అన్నాడు. ఈ డైరెక్టర్‌కి విషయం ఉందంటూ కితాబిచ్చాడు.
#Eagle #EAGLEFromToday Bgm nd ammavari hands nunchi guns ha fight scene mind nunchi pothaledhu ha thought vision. Gun shoot chesi cigar lit 🔥 cheydam pure mass.. e director lo Chala matter vundi 👌👌 @RaviTeja_offl @peoplemediafcy @Karthik_gatta
— Mohan_The_King 👑 (@Mohan_TheKing) February 9, 2024
రవితేజలాంటి ఓ ఎనర్జిటిక్ యాక్టర్.. కార్తీక్ ఘట్టమనేని వంటి డైరక్టర్ దొరికితే దాని ఫలితం ఈగల్ మూవీలా ఉంటుంది.. దర్శకుడికి సినిమాపై ఫుల్ క్లారిటీ ఉంది.. అందుకే బిగ్ స్క్రీన్ మీద విస్పోటనంగా సినిమా తెరకెక్కించగలిగాడు.. మొదటి నుంచి రిలాక్స్‌గా కూర్చునే ప్రేక్షకుడి.. సినిమా జరుగుతున్న కొద్దీ క్షణక్షణం ఉత్కంఠంగా ఫీల్ అవుతాడు. ఇక కథ విషయానికొస్తే.. రొటీన్‌గానే ఉందని అనిపించినప్పటికీ.. అదే టైంలో సర్ ప్రైజ్ ఫీల్ కలుగుతుంది. ప్రత్యేకంగా ఈ డైరెక్టర్‌కు గన్స్ మీదున్న నాలెడ్జ్‌కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. ప్రజెంటే చేసే విధానం కొత్తగా ఉందని సినిమాకు సంబంధించి పాజిటివ్ అంశాలను మరో నెటిజన్ తెలిపాడు.
When an energetic actor like @RaviTeja_offl meets a director @Karthik_gatta who has clarity, the result is #Eagle. Witness this #VISPOTANAM on the big screen. You will be in for a ride!
If you are relaxed in your seat at the beginning, you will be at the edge of your seat by… pic.twitter.com/e5W3xhQeEA
— ReView You Never Knew (@OkaManchiReview) February 9, 2024
మరో నెటిజన్ ఈగల్ సినిమాలో రవితేజ్ గెటప్, నటన, డైలాగ్స్, ఫైట్స్, క్లైమాక్స్, వంటివి పాజిటివ్‌గా అంశాలని… అలానే ఎమోషనల్ కనెక్ట్ కాలేమని, కొన్ని చోట్ల సీన్లు సాగదీత వంటి అంశాలను నెగటివ్‌గా రాసుకొచ్చాడు. అయితే ఓవరాల్‌గా మూవీ బాగుందని తెలిపాడు.
Waiting #Eagle – Part 2 💥💥🙏
Positives @RaviTeja_offl Getup & Performance
Dialogues
Fights Chusi Shock loki vellipotham
Elevations
Climax; Good lead for 2nd Part
Negatives
No proper emotional connect
Few lags
Overall- Very Good Attempt 💥🏆🏆#EagleMovie pic.twitter.com/BCtDOxU9sU
— 𝐀𝐥𝐥𝐚𝐫𝐢 𝐑𝐚𝐦𝐮𝐝𝐮 𝐍𝐓𝐑 (@AllariRamuduNTR) February 8, 2024
ఇకపోతే ‘ఈగల్’ మూవీ రెండో పార్ట్ యుద్దకాండ ఉన్నట్లు నెట్టింట ఫోటోలు దర్శనమిస్తున్నాయి. అంటే ఈగల్ సీక్వెల్ కూడా ఉందని తెలుస్తోంది. ఇక్కడ పేర్కొన్న అంశాలు కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. వీటికి ‘తెలుగున్యూస్నౌ’ బాధ్యత వహించదు.