Varsha Bollamma: ఫిలిం ఇండస్ట్రీలో రూమర్స్ కామన్. ఒక హీరో, హీరోయిన్ కలిసి నటిస్తున్నప్పుడు వాళ్లు కాస్త క్లోజ్ కనిపించినా, లేదా మూవీ అయ్యాక మళ్ళీ వాళ్ళు బయట ప్రత్యక్షమైన ఇక.. వారి మీద పుకార్లు చుట్టుముడతాయి. ఆ ఇద్దరి మధ్య ప్రేమ, పెళ్లి, రిలేషన్ అంటూ ఇలా ఎక్కడ లేని వార్తలు పుట్టుకొస్తాయి. ఈ తరహాలోనే ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తున్న హీరోయిన్ వర్ష బొల్లమ్మ పై ఓ వార్త సినీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
తాను ప్రముఖ నిర్మాత కొడుకుతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు.. త్వరలోనే పెళ్లికి కూడా సిద్ధమైనట్లు రూమర్స్ వచ్చాయి. తాజాగా వాటిపై ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చేసింది.
((దీనిపై ఓ లుక్కేయండి: నిర్మాతలకు ఇలానే చెబుతా.. రెమ్యునరేషన్ పెంపు వార్తలపై అదిరిపోయే రిప్లై!))
ఇదంతా ఆ మూవీ నుంచే మొదలైంది
కోలీవుడ్ నటి వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) తెలుగు ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొట్టమొదటిగా విజయ్ దళపతి నటించిన విజిల్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తరువాత మిడిల్ క్లాస్ మెలోడీస్, స్టాండ్ అప్ రాహుల్, స్వాతిముత్యం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
ఈ క్రమంలో ఈ బ్యూటీ హీరో బెల్లంకొండ గణేష్ బాబుతో స్వాతిముత్యం సినిమాలో కలిసి నటించింది. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న టైం లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు మూవీ రిలీజ్ అయిన సమయంలో పెద్ద ఎత్తున టాక్ కూడా నడిచింది. కానీ దీనిపై అప్పట్లో ఎవ్వరు స్పందించలేదు. దీంతో వీరు సీక్రెట్ గా ప్రేమాయణం నడిపిస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని మరో ప్రచారం మొదలైంది. తమ పెళ్లి గురించి స్వయంగా బెల్లంకొండ గణేష్ చెప్తాడంటూ అందరూ తెగ వెయిట్ చేశారు. ఎట్టకేలకు ఇంతకాలానికి ఈ విషయం పై క్లారిటీ వచ్చేసింది.
ఊరు పేరు భైరవకోన అనే మూవీతో వర్ష మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో హీరోగా సందీప్ కిషన్ నటించిన వి ఐ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూకి హాజరైన వర్ష మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. వీటితో పాటు తన పర్సనల్ లైఫ్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. బెల్లంకొండ గణేష్ తో ప్రేమ పెళ్లి పై వస్తున్న వార్తలపై స్పందించింది.
అసలు క్లారిటీ ఇది…
మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరం ఒక్కసారి కూడా బయట కలవలేదు. తాము ఇద్దరం కలిసి బయట కనిపిస్తే ఇలాంటి న్యూస్ నమ్మొచ్చు. ఎప్పుడు ఒకరి గురించి ఒకరి మాటలు మాట్లాడుకోవడం కానీ, నేనేదైనా పోస్ట్ చేస్తే అందుకు తాను రియాక్ట్ అవడం, తన పోస్టులకు నేను రియాక్ట్ కావడం లాంటి పనులు చేస్తే అందులో అర్థం ఉంటుంది.
కానీ మా మధ్యలో ఇలాంటివి ఏమీ జరగకుండానే ఇలాంటి వార్తలు రావడం చూసి షాక్ అయ్యాను. నిజం చెప్పాలంటే అతను చాలా మంచి మనిషి, గుడ్ ఫ్రెండ్. కానీ మా పై ఇలాంటి రూమర్స్ విని షాక్ అయ్యానంటూ చెప్పుకొచ్చింది. తన చెప్పుకొచ్చిన మాటలతో ఈ పుకార్లకు చెక్ పెట్టింది వర్ష.