Aadhaar card: భారత ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులలో ముఖ్యమైనది ఆధార్ కార్డ్. ఇటీవల బ్యాంకులు, ప్రభుత్వ అందించే పథకాలు, పాన్ కార్డ్‌లతో అనుసంధానించే సరికి .. ఆధార్ ప్రాముఖ్యత మరింత పెరిగిందనే చెప్పాలి. అందుకే ఈ కార్డ్‌లో మన సమాచారానికి సంబంధించిన ఎటువంటి తప్పులు ఉండకుండా చూసుకోవడం తప్పనిసరిగా మారింది.
ఈ క్రమంలో ఆధార్‌లో.. అడ్రస్, ఫోన్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ తదితర మార్పులను ఆన్లైన్లోనే ఉచితంగా సవరించుకునే విధంగా కేంద్రం గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువు ఈ ఏడాది మార్చి 14 తో ముగియనుంది. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి మరోసారి గడువును పొడిగించే ఛాన్స్ ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
(( దీనిపై ఓ లుక్కేయండి: రైల్వే ప్యాసింజర్లకు అలర్ట్.. ప్రయాణించే ముందు ఇవి తప్పక తెలుసుకోవాలి! ))
గడువు ముగుస్తోంది
భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో మన ఆధార్ (Aadhaar card) వివరాలను ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆధార్‌లో మార్పులు కోసం ప్రయత్నిస్తుంటే.. వారు మార్చి 14 ముగిసేలోపే తమ కార్డుని అప్డేట్ చేసుకోవాలంటూ ఆధార్ ప్రతినిధులు కోరుతున్నారు. గతంలో 2023 డిసెంబర్ వరకు ఉన్న గడువును ప్రభుత్వం మూడు నెలల పాటు పొడిగించింది.
అంటే మార్చి14, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఒక సారి గడువు పొడిగించారు కనుక.. మళ్లీ మరోసారి పెంచే అవకాశాలు లేనట్లే కనిపిస్తోంది. ఆధార్ కార్డులో అడ్రస్, వ్యక్తిగత వివరాలను మార్చుకోవాలనుకునేవారు అందుకు సంబంధించిన ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం వాటిని పరిశీలించి అధికారులు ధృవీకరించిన తరువాత వివరాలు అప్డేట్ అవుతాయి. ఆ తర్వాత కొత్త ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఆధార్ అప్డేట్ చేసుకునే పద్ధతి
(1) UIDAI అధికార వెబ్ సైట్లోకి వెళ్లండి.
(2) UIDAI వెబ్ సైట్ లో మై ఆధార్ టాప్ కింద ఉన్న అప్డేట్ ఆధార్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
(3) మీ ఆధార్ కార్డు నెంబర్, స్క్రీన్ పై కనిపించే సెక్యూరిటీ కోడ్ నెంబర్ ను ఎంటర్ చేయండి. ఓటిపి బటన్ పై క్లిక్ చేయండి.
(4) మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వన్ టైం పాస్ వర్డ్ వస్తుంది. వెంటనే ఆ నెంబర్‌ను అక్కడ ఎంటర్ చేసి, లాగ్ ఇన్ బటన్‌పై క్లిక్ చేయండి.
(5) మీరు అప్డేట్ చేయాలనుకునే అడ్రస్, ఫోన్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ తదితర వివరాల వంటివి ఫీల్డ్ లలో ఎంచుకోండి.
(6) మీరు చేయాలనుకునే మార్పులకు సపోర్ట్ ఇచ్చే డాక్యుమెంట్లతో స్కాన్ చేసి, కాపీలను అప్లోడ్ చేయండి.
(7) మీరు చేసిన మార్పులను రివ్యూ చేసి అనంతరం సబ్ మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
(8) ఆధార్ కార్డ్ మార్పు రిక్వెస్ట్ సమర్పించిన తదనంతరం మీ ప్రత్యేకమైన అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ యుఆర్ఎన్ (URN)తో కన్ఫర్మేషన్ అందుకుంటుంది. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం URN ను జాగ్రత్తగా దగ్గర ఉంచుకోండి.
(9) మీ UIDAI వెబ్ సైట్ లోని URN ను ఉపయోగించి లేదా యుఐడిఏఐ (UIDAI) మొబైల్ యాప్ ద్వారా మీ అప్డేట్ అభ్యర్థన స్టేటస్ ట్రాక్ చేయవచ్చు. ఆధార్ కార్డులోని వ్యక్తిగత డేటాను ఆన్ లైన్ లో అప్డేట్ చేయడం యుఐడిఏఐ ద్వారా వెరిఫికేషన్ లోబడి ఉంటుందని గమనించాలి.
(10) అప్డేట్ అభ్యర్థన ఆమోదించిన అనంతరం మీరు సవరించిన డేటాతో అప్డేట్ ఆధార్ కార్డ్‌ని అందుకుంటారు.