OTT Releases This Week: కరోనా రాకతో మన జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. చివరికి సినీ ఇండస్ట్రీ మీద ఈ ప్రభావం తప్పలేదు. ఈ క్రమంలో ఓటీటీ హవా రోజురోజుకి పెరుగుతూ.. చివరికి థియేటర్లకు వెళ్లకుండానే ఇంట్లోనే తమ అభిమాన హీరో హీరోయిన్ల సినిమాలను కుటుంబంతో కలిసి ఇంట్లోనే చూసే అవకాశాన్ని కల్పించింది.
నెట్ ఫిక్స్, అమెజాన్ ప్రైమ్, జి ఫైవ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ లివ్, ఆహా, ఆపిల్, టీవీ ప్లస్ ఇలా పలు వేదికలపై ప్రేక్షకులు తమకు నచ్చిన మూవీలను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయం కాస్త పక్కన పెడితే ఎప్పటిలాగే ఈ వారం ఓటిటిలో సందడి చేసేందుకు పలు సినిమాలు, వెబ్ సీరీస్ రెడీ అయిపోయాయి. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
((దీనిపై ఓ లుక్కేయండి: కొత్త లుక్లో ప్రిన్స్.. పూనకాలు గ్యారెంటీ అంటున్న ఫ్యాన్స్!))
యంగ్ అండ్ డైనమిక్ హీరో సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ తెరకెక్కించిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఈ మూవీ ఫిబ్రవరి 16వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. కోలీవుడ్ హీరో జయం రవి నటించిన సైరన్ మూవీ కూడా ఫిబ్రవరి 16వ తేదీన థియేటర్లలోకి రాబోతుంది. వీటితో పాటు మమ్ముట్టి ప్రధాన పాత్రలో వస్తున్న భ్రమయుగం చిత్రం కూడా ఫిబ్రవరి 15వ తేదీన రిలీజ్ కాబోతుంది.
‘
OTT Releases This Week: నెట్ ప్లిక్స్
ఫిబ్రవరి 13వ తేదీ నుండి ‘సండర్ లెండ్ టిల్ ఐ డీ ‘ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 14 నుండి ‘లవ్ ఈజ్ బ్లైండ్ ‘ అనే వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఇక ఫిబ్రవరి 16వ నుండి ‘ఐన్ స్టీన్ అండ్ ది బాంబ్ ‘ అని హాలీవుడ్ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ఫిబ్రవరి 12వ తేదీ నుండి ‘ట్రాకర్ ‘ అనే వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. సబ్ నయగన్ అనే తమిళ చిత్రం ఫిబ్రవరి 14వ తేదీ నుండి విడుదల కానుంది. మలయాళ సినిమా అయిన ఓజ్లర్ కూడా ఫిబ్రవరి 15వ తేదీ నుండి స్క్రీమింగ్ కాబోతోంది. ఇక హిందీ సలార్ సినిమా కూడా ఫిబ్రవరి 16వ తేదీన విడుదల కానుంది. అలాగే నాగార్జున హీరోగా రీసెంట్ గా వచ్చిన నా సామిరంగా సినిమా ఫిబ్రవరి 17వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్
ఫిబ్రవరి 13వ తేదీ నుండి ఫైవ్ బ్లైండ్ డేట్స్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అలాగే దిస్ ఈజ్ నౌ అనే హాలీవుడ్ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన విడుదల కానుంది.
జి ఫైవ్(zee5)
క్వీన్ ఎలిజిబిట్ అనే మలయాళం సినిమా ఫిబ్రవరి 16 నుండి విడుదల కాబోతుంది. అదేవిధంగా దాదాపు కొన్ని నెలల పాటు వివాదాస్పదమైన ది కేరళ స్టోరీ ఫిబ్రవరి 16వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది.
సోనీ లివ్(sony liv)
ఫిబ్రవరి 12వ తేదీ నుండి రాయ్ సింఘానీ వర్సెస్ రాయ్ సింఘానీ అనే హిందీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది.
ఆహా
తమిళ సినిమా అయిన ‘వీరమారి’ అనే లవ్ స్టోరీ ఫిబ్రవరి 14వ తేదీ విడుదల కాబోతుంది. ది న్యూ లుక్ అనే వెబ్ సిరీస్ కూడా ఫిబ్రవరి 14వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఏదేమైనా మూవీ లవర్స్ కు పండగనే చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం.. లేట్ చేయకుండా ఈ వీకెండ్ ను ఎంజాయ్ చేసేయండి.