Tantiram Movie: సరికొత్త కథాంశాలు, కొత్త కంటెంట్లు, సరికొత్త సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించే విషయంలో ఓటీటీ సంస్థలు ఎప్పుడూ ముందు ఉంటాయి. అందుకే మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తుందంటే చాలు తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కోసం ఎగబడుతుంటాయి. అలా ఓటీటీలోకి రిలీజ్ అయిన కొన్ని సినిమాలు ఎవరు ఊహించని విధంగా ప్రేక్షకులకు నచ్చుతుంటాయి. ఈ తరహా చిత్రాలు సైలెంట్‌గా ఓటీటీలో దూసుకుపోతుంటాయి. ఇటీవల ఈ నేపథ్యంలో ఓ సస్పెన్స్ హర్రర్ మూవీ దుమ్ములేపుతోంది. ఇంతకీ ఏంటా మూవీ అంటే..
సైలెంట్‌గా ఓటీటీలో దుమ్ములేపుతోంది..
ప్రస్తుత రోజుల్లో సినీ లవర్స్ థియేటర్లతో పాటు ఓటీటీల మీద ఓ కన్ను వేస్తున్నారు. లవ్ స్టోరీస్, సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ టిల్లర్, కామిక్ సినిమాలులతోపాటు రకరకాల వెబ్ సిరీస్‌లు ఓటీటీలో అందుబాటులో ఉంటున్నాయి. విరామ సమయంలో ఏ మూవీ బాగుంది, ఈ రోజు ఏ సినిమా చూసేద్దాం అంటూ ప్లాన్లు చేసుకుంటున్నారు. అందుకే చాలా మంది ఓటీటీలో మంచి కంటెంట్ ఉన్న మూవీల గురించి తెగ వెతుకుతున్నారు. అలాంటి వాళ్ల కోసం ఈ మూవీ సరిపోతుంది.
((దీనిపై ఓ లుక్కేయండి: కొత్త లుక్‌లో ప్రిన్స్.. పూనకాలు గ్యారెంటీ అంటున్న ఫ్యాన్స్!))
ఇటీవల విడుదలైన తంతిరం ఛాప్టర్ 1: టేల్స్ ఆఫ్ శివకాశీ’ (Tantiram Movie)అనే హారర్ సస్పెన్స్ మూవీ ఓటీటీలో సైలెంట్ గా దుమ్ము లేపుతుంది. హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ మూవీ తెగ నచ్చేస్తుంది. ఇక ఐఎండీబీ కూడా ఈ సినిమాకు ఏకంగా 8 రేటింగ్ ఇచ్చింది. ఈ మూవీని ముత్యాల మోహర్ దీపక్ దర్శకత్వం వహించగా.. శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ, అవినాష్ ఎలందూరు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. ఇక దర్శకుడు మొదటి భాగం కంటే రెండవ చాప్టర్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల మొదటి చాప్టర్లో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. కానీ చాప్టర్ 2 లో ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వుంటాయి.
అసలు కథ ఏంటంటే..
ఓ పాడుబడిన గోదాముకు విజయ్ అనే కుర్రాడు తన మిత్రులకు పార్టీ ఇచ్చేందుకు వెళ్తాడు. విజయ్ తన మిత్రులతో ఒక ఆసక్తి కథ చెప్తానంటూ మొదలు పెడతాడు. ఆ కథే చాప్టర్ 1.
ఆ యజమాని పేరు బాలచంద్రన్(శ్రీకాంత్ గుర్రం) అతని భార్య అలగిని (ప్రియాంక శర్మ). ఒక వ్యక్తి మరో లోకంలో ఉండే జీనీ పెట్టిన ఆశలకు ఎలా బలయ్యాడు? అనుకోకుండా బాలచంద్రన్ జీవితంలోకి జీనీ ప్రవేశంతో ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అనేది కథ. అసలు జీనీ కథలు నిజమేనా? జీనీ ఎందుకు బాలచంద్రన్ లైఫ్ లోకి వచ్చాడు? ఇంతకీ జీనీ ప్రవేశంతో బాలచంద్రన్ లైఫ్ ఏమైంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి.
అలాగే బాలచంద్రన్ కథ విజయ్‌కి ఎలా తెలుసు? అసలు విజయ్ ఎవరు? ఆ ఫ్యాక్టరీకే తన మిత్రులను ఎందుకు తీసుకొని వస్తాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు చాప్టర్ 2 లో సమాధానాలు దొరుకుతాయి. ఇలా అడుగడుగునా సస్పెన్స్, హర్రర్, డ్రామాతో కూడిన ఈ చిత్రం సినీ లవర్స్‌కు నచ్చుతుందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఒక మనిషి జీవితంలో ఉండే కోపం, ద్వేషం, దురాశ ఇలా ప్రతి ఎమోషన్ ని ఎంతో చక్కగా చూపిస్తారు. ఇక ఎన్నో సస్పెన్స్‌ల నడుమ సాగే ఈ మూవీని చూడని వారు ఉంటే వెంటనే వెళ్లి చూసి ఎంజాయ్ చేయండి.