The Kerala Story: ఎప్పుడొచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్న మూవీ డైలాగ్‌లా ఉంది ‘ది కేరళ స్టోరీ’ మూవీ సక్సెస్. ఎన్నో వివాదాల నడుమ ఎన్నో విమర్శలు అందుకున్న ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీలోకి ఎంటర్ అయిన ఈ మూవీ బౌండరీలు బ్రేక్ చేస్తూ సెన్సేషనల్ రికార్డ్ సృష్టిస్తోంది. లేట్‌గా వచ్చినా లేటెస్ట్ గా దూసుకుపోతోంది. ఇంతకీ ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? ఈ సినిమా చుట్టు వివాదాలు ఎందుకు చుట్టుముడుతున్నాయంటే..
((దీనిపై ఓ లుక్కేయండి: కొత్త లుక్‌లో ప్రిన్స్.. పూనకాలు గ్యారెంటీ అంటున్న ఫ్యాన్స్!))
సినిమా మొదలు నుంచి వివాదమే..
డైరెక్టర్ సుదీప్తా సేన్ దర్శకత్వంలో నటి ఆదాశర్మ మెయిన్ లీడ్‌లో నటించిన మూవీ ది కేరళ స్టోరీ. ఎన్నో విమర్శల నడుమ విడుదలైన ఈ సినిమాకు ట్రైలర్ నుంచి థియేటర్ రిలీజ్ వరకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. కేరళలో వివాదాస్పదమైన లవ్ జిహాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఎన్నో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలంతోపాటు పలు ముఖ్య నగరాల్లోని మల్టీప్లెక్స్ లలో షోలు క్యాన్సిల్ చేయగా.. మరోవైపు ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
వివాదాలతోనే క్రియేట్ అయిన బజ్
థియేటర్లో విడుదలకు ముందే వివాదాల కారణంగా ‘ది కేరళ స్టోరీ’ వార్తల్లో నిలిచింది. మరో రకంగా చెప్పాలంటే ఈ మూవీకి వివాదాలే బజ్‌ని క్రియేట్ చేశాయనే చెప్పాలి. దీంతో ఈ చిత్రం ఏదో ఒకరూపంలో నెట్టింట, అటు మీడియాలో నిలవడంతో.. ది కేరళ స్టోరీ సక్సెస్‌కి ఇదొక కారణమనే చెప్పచ్చు. దీంతో ధియేటర్ ఎక్స్పీరియన్స్ చేయని వాళ్లు ఓటిటి రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. ఎన్నో అడ్డంకులు దాటుకుని ఎట్టకేలకు ది కేరళ స్టోరీ ఓటీటీలోకి రిలీజ్ అయింది. రికార్డులు మీద రికార్డులు తిరగ రాస్తూ బౌండరీలను బ్రేక్ చేస్తోంది.
ఓటిటిలో సెన్సేషనల్ రికార్డ్
ఇది కేరళ స్టోరీ ఓటీటీ రిలీజ్ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు తిరగ రాసిన ఈ సినిమా వివాదాలు ఉన్న కారణంగా డిజిటల్ రైట్స్ కొనడానికి ఏ ఒక్కరు ముందుకు రాలేదు. ఈ చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేయడానికి నిరాకరించారు కూడా. చివరికి ప్రముఖ ఓటీటీ జి ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎవరూ ఊహించని స్థాయిలో రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఈ వీకెండ్లో అందరిని ఆశ్చర్యపరుస్తూ 150 కు పైగా మిలియన్ వాచ్ మినిట్స్ అందుకున్నట్లు అధికారికంగా ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఏదేమైనా మొత్తానికి ది కేరళ స్టోరీ ని బ్యాన్ చేసే స్థాయి నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమాను థియేటర్లో మిస్ అయిన వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓటీటీలో చూసేయండి..