Vamshhi Krrishna Hits 6 Sixes In An Over C K Nayudu Trophy: అప్పుడెప్పుడో జరిగిన టీ20లో టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 6 బంతులకు ఆరు సిక్సర్లతో ఇంగ్లండ్ జట్టుపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఇదే సీన్ రిపీట్ చేశాడు ఆంధ్ర జట్టు ఓపెన్ మామిడి వంశీకృష్ణ. ఒకే ఓవర్లో 6 సిక్సర్లను బాది మరోసారి యువీ బ్యాటింగ్‌ను గుర్తు చేశాడు. అసలు ఈ భీకర బ్యాటింగ్ ఎక్కడ జరిగిందంటే..
ఇదేం బ్యాటింగ్ రా అయ్యా!
భారత దేశవాళీ క్రికెట్లో అండర్-23 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువ క్రికెటర్ వంశీకృష్ణ తన బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించాడు. ఈ 22 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ టోర్నమెంట్లో చెలరేగి.. టీ20 ఫార్మట్ లాగా బ్యాటింగ్ చేశాడు. ఒకే ఓవర్లో వరుసగా 6 సిక్సర్లను బాదాడు. వంశీ తుపాను బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వారేవ్వా.. వాట్ ఏ బౌలింగ్! 4 బంతుల్లో .. 4 వికెట్లు పడగొట్టిన భారత యువ పేసర్!
6 బంతులకు 6 సిక్సులు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి.. 90 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 372 పరుగులు చేసింది. రైల్వేస్ లెగ్ స్పిన్నర్ ధమాన్ దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 10 ఓవర్లో గుంటూరు జిల్లాకు చెందిన 22 ఏళ్ల వంశీకృష్ణ ఎవ్వరూ ఊహించని విధంగా ఒకే ఓవర్లో వరుస ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి ఔరా అనిపించాడు.
రైల్వేస్ పై ఆంధ్ర తరఫున ఆడిన వంశీకృష్ణ 64 బంతుల్లో 110 పరుగులు తేసి తన సత్తా చాటాడు. మరోవైపు వంశీకృష్ణ బ్యాటింగ్ కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్ ట్విటర్ లో షేర్ చేసింది. వంశీకృష్ణ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ.. అతని ప్రతిభకు అద్దం పట్టేలా బీసీసీఐ తన వీడియోకి ఒకే ఓవర్ లో 6 సిక్సులు ఓ హెచ్చరిక” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
మ్యాచ్ డ్రా..
ఈ తరహా రికార్డ్ నమోదైనప్పటికీ ఆంధ్ర-రైల్వేస్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగించుకోవాల్సి వచ్చింది. రైల్వేస్ తొలి ఇన్నింగ్స్ భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర జట్టు 378 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన రైల్వేస్ టీం మొదటి ఇన్నింగ్స్‌లో 865 పరుగుల భారీ స్కోరును సాధించింది. రైల్వేస్ తరపున యాన్ష్ యాదవ్ (268), రవి సింగ్ (258) డబుల్ సెంచరీలు చేశారు.
𝟔 𝐒𝐈𝐗𝐄𝐒 𝐢𝐧 𝐚𝐧 𝐨𝐯𝐞𝐫 𝐀𝐥𝐞𝐫𝐭! 🚨
Vamshhi Krrishna of Andhra hit 6 sixes in an over off Railways spinner Damandeep Singh on his way to a blistering 64-ball 110 in the Col C K Nayudu Trophy in Kadapa.
Relive 📽️ those monstrous hits 🔽@IDFCFIRSTBank | #CKNayudu pic.twitter.com/MTlQWqUuKP
— BCCI Domestic (@BCCIdomestic) February 21, 2024