Mahesh Babu Rejected Movie: టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ అభిమానులతో పాటు సినీ లవర్స్‌ని అలరిస్తూంటాడు. కెరీర్‌తో పాటు సమానంగా తన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ .. తీరిక దొరికినప్పుడల్లా వారితో విహారయాత్రలకు వెళ్లి వస్తుంటాడు.
అంతలా ప్లానింగ్ చేస్తుంటాడు కాబట్టే సినిమా కథలు, దర్శకుల విషయంగా కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూంటాడు ప్రిన్స్. అలాగే దక్షిణాదిలో స్టార్ డైరక్టర్ ప్రిన్స్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేయగా.. అందుకు మహేష్ నో చెప్పాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.
((దీనిపై ఓ లుక్కేయండి: సామ్ విడాకులకు కారణం ఈ అమ్మాయేనా?.. నెట్టింట రచ్చ చేస్తున్న పోస్ట్!))
కథ నచ్చితే ఓకే
మహేష్ బాబు గురించి తెలిసిందే. కెరీర్ మొదట్లో సినిమాల పరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాడు. గతంలో ప్రయోగాలు చేసినా ప్రస్తుతం వాటి జోలికి పోవడం లేదు. తన దగ్గరకు వచ్చే కథలలో .. అవి ఎంత బాగున్నా సరే.. క్యారెక్టర్ పరంగా తనకు సరిపోతుందా లేదా అని బేరీజు వేసుకుని ఆంగీకరించడమో లేదా రిజెక్ట్ చేయడమో చేస్తుంటాడు. ఇలా ఒక్కోసారి స్టార్ డైరక్టర్లకు కూడా నో చెప్పేస్తుంటాడు. తాజాగా నెట్టింట ఈ వార్త తెరపైకి వచ్చి రచ్చ చేస్తోంది.
తమిళంలో కాదు దక్షిణాదిలో కూడా డైరక్టర్ శంకర్‌కి మంచి క్రేజ్ ఉంది. ఇక రజనీ శివాజి, రోబో మూవీతో ఈ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుందనే చెప్పాలి. శంకర్ హిందీలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన త్రీ ఇడియట్స్ సినిమాను తెలుగులో మహేష్ తో తీయాలని నిర్ణయించుకుని.. అందుకు కావాల్సిన ప్రయత్నాలు కూడా చేశాడు.
అయితే ప్రిన్స్‌కి ఈ కథ నచ్చలేదేమో గానీ శంకర్‌కి నో చెప్పాడట. దీంతో త్రీ ఇడియట్స్ చిత్రాన్ని తమిళ స్టార్ హీరో విజయ్‌తో తెరకెక్కించాడు. ఈ చిత్రం అప్పుడు మహేష్ ఎందుకు రిజెక్ట్ చేశాడో గానీ దీని ఫలితం మాత్రం అటు తమిళంలో యావరేజ్ గా, ఇటు తెలుగులో ఫ్లాప్ గా నిలిచింది.
రెండో సారి కూడా నో
దీని తర్వాత కొన్నాళ్లకు శంకర్‌కు మళ్లీ తెలుగులో నేరుగా సినిమా చేయాలనే ఉద్దేశంతో మరోసారి సూపర్‌స్టార్‌ని కలిశాడు. గతంలో అది రీమేక్ మూవీ కాబట్టి ఒప్పుకోలేదు.. ఈ సారైన కుదురుతుందని భావించిన శంకర్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. రెండో సారి కూడా మహేష్ నో చెపేశాడట.
శంకర్ తెచ్చిన కథలు నచ్చడంలేదోకానీ ఈ రెండు సందర్భాల్లో నో చెప్పాడు ప్రిన్స్. దీంతో మళ్లీ శంకర్ మహేష్ తో సినిమా కోసం ప్రయత్నించలేదని టాక్. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ తమ తమ ప్రాజెక్ట్‌లలో బిజీ బిజీగా ఉండిపోయారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి.. తమ అభిమాన హీరో, శంకర్‌తో సినిమా చేసుంటే బాగుండేదని.. ఈ క్రేజ్ కాంబో అదిరిపోయేదని కామెంట్లు పెడుతున్నారు.