Varun Tej’s Operation Valentine Movie Twitter Review in Telugu: ఇటీవల ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఏరియల్ యాక్షన్ సినిమాలు ఇప్పుడిప్పుడే ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. తెలుగులో ఈ తరహా సినిమా తొలిసారిగా వస్తుందన్న సంగతి తెలిసిందే. విభిన్న కథాంశాలతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో మరో సారి కొత్త జోనర్‌తో మన ముందుకు వచ్చాడు.
గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో యధార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీకి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించగా.. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేశారు. ఇందులో వరుణ్ సరసన మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ కనిపించనుంది.
గత కొంతకాలంగా హిట్ కోసం ఎదరుచూస్తున్న వరుణ్ ఈ సినిమాపై భారీగా అంచనాలే పెట్టుకున్నాడు. సక్సెస్‌ని అందుకుని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఈ మూవీ అటు హిందీలోనూ ఇటు తెలుగులోనూ ఏకకాలంలో నిర్మాణం జరుపుకొని రెండు చోట్లా ఆడియన్స్ ముందుకు మార్చి 1న వచ్చింది. ఇప్పటి వరకు సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో సినిమా అంటే బాలీవుడ్ తెరకెక్కించిన ‘ఉరి’.. అందులో విక్కీ కౌశల్ నటన గుర్తుకువస్తుంది. తాజాగా వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో మాయ చేశాడా? వరుణ్ అనుకున్నట్లు సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా? తాజాగా ట్విట్టర్లో ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఓ లుక్కేద్దాం.. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘తెలుగున్యూస్నౌ’ బాధ్యత వహించదు.
ఓ నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు.. ఆపరేషన్ వాలైంటెన్ ఇప్పుడే చూశాను. ఈ తరహా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకవచ్చినందుకు మూవీ టీంకు అభినందనలు. ఇందులో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ పని తీరు బాగుంది. వజ్రం లాంటి సినిమాను ప్రేక్షకుల ముందు ఉంచిన వరుణ్ తేజ్‌కు కంగ్రాట్స్. సినిమా యూనిట్‌కు బిగ్ కంగ్రాట్స్ అని తెలిపాడు.
Just saw #OperationValentine really need to appreciate the team for the great effort❤️ great visuals and production designs congratulations @IAmVarunTej garu for bringing this gem ✨✨ big congratulations for the whole team ✨❤️ pic.twitter.com/MqCEA95rvn
— VAMSEE (@DirVamsee) February 29, 2024
సుజలం సుఫలం మలయజ సీతలం సస్యశ్యామలం మాతరం వందేమాతరం అంటూ మొదలెట్టి.. OperationValentine చిత్రం అంతటా గూస్బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. సరైన స్థలంలో సరైన భావోద్వేగాలతో కూడిన అద్భుతమైన వైమానిక పోరాట చిత్రం. బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే అద్భుతమైన BGM, టాప్ రేంజ్లో VFX ఉంది. పుల్వామా సంఘటన విజువల్స్ ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు తెప్పించడంతో పాటు హృదయాలను బరువెక్కేలా చేస్తాయి. మమ్మల్ని చాలా ఎమోషనల్‌గా చేసింది. ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్ కూడా బాగా తెరకెక్కించారంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
Sujalam suphalaam Malayaja seethalam Sasyasyaamalam Maataram🇮🇳
VANDE MATARAM 🫡#OperationValentine has Goosebumps moments throughout the film. A perfect aerial combat movie with the right emotions in the right place.❤️🔥
Terrific BGM and Top-notch VFX considering the budget.… pic.twitter.com/nE5bDyNUN7
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 28, 2024
మరో నెటిజన్ ఇలా… ఆపరేషన్ వాలెంటైన్ మూవీ నాకు బాగా నచ్చింది. సూపర్‌గా ఉంది. ఇందులో వరుణ్ తేజ్ నటన బాగుంది, అలానే ఇతర పాత్రలకు ఎంపిక చేసిన నటుల ఫెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కొత్త తరహా కథ అయినప్పటికీ దర్శకుడు బాగానే డీల్ చేశాడు. గతంలో పుల్వామా దాడి గురించి ఈ రేంజ్లో ఎవరూ చూపించలేదేమో అని నాకు ఫీలింగ్ కలిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు నా జోహార్లు అని కామెంట్ చేశాడు.
#OperationValentine super nachindi 😍
Varun & casting antha perfect set ayyaru. Director baga deal chesadu story ni. Pulwama attack Gurinchi ee range lo evaru chupiyyaleru emo annattu anipinchindi. Bow down to the martyrs who sacrificed their lives.
— Dhoni Stan (@DhoniStan10) February 29, 2024