Rakul Preet Singh Flop Movies Last 5 Years: సినీరంగంలో హీరోయిన్గా అవకాశాలు రావాలంటే అందం, అభినయంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. బాక్సాఫీస్ వద్ద తారలు చేసిన సినిమాలు మినిమం గ్యారెంట్ హిట్ టాక్ తెచ్చుకుని వసూళ్ల పరంగా పర్వాలేదని అనిపించిన సరిపోతుంది. లేదా భారీ హిట్లు, బ్లాక్బస్టర్లు పడితే ఇక కెరీర్ పరంగా టాప్‌కి దూసుకెళ్లచ్చు. అయితే ఓ నటి వరుస ఫ్లాప్‌లతో దక్షిణాది నుంచి కనుమరుగైంది. బాలీవుడ్‌కి వెళ్లి అక్కడైనా లక్ పరీక్షించుకుందామనుకున్నా అక్కడ కూడా ఇదే కథ నడిచింది. గత ఐదు సంవత్సరాలలో దారుణమైన ఫ్లాప్‌లను తన ఖాతాలో వేసుకుంది.
ఆ సినిమా కెరీర్‌ను మార్చేసింది
కన్నడ మూవీతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్లోకి కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాలు చేసినా.. చివరికి తెలుగులో సందీప్ కిషన్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో మంచి హిట్‌తో పాటు ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో వరుస ఆఫర్లు అమ్మడుకి వెత్తుక్కుంటూ వచ్చాయి. స్టార్ హీరోలతో జతకట్టిన రకుల్.. చూస్తుండగానే స్టార్ హీరోయిన్గా మారిపోయింది.
ఇక కొన్ని సినిమాలలో గ్లామర్‌తో కుర్రకారుకి పిచ్చేక్కించింది. అలా సినిమాలు చేస్తూ దక్షిణాదిలో అగ్ర హీరోయిన్ స్టేటస్‌ను సంపాదించుకుంది.ఇక్కడ వరకు బాగానే ఉంది గానీ.. కథల ఎంపిక సరిగా లేకపోవడంతో హిట్లు కంటే ఫ్లాప్‌లతో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లింది.
(( దీనిపై ఓ లుక్కేయండి:: ప్రభాస్ డూప్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎంతో తెలుసా? ))
వరుస ఫ్లాపులు
రామ్‌చరణ్‌తో బ్రూస్లీ, సాయిధరమ్ తేజ్‌తో విన్నర్ సినిమాలు బాక్సాఫీస్ ముందు చతికిలపడ్డాయి. 2018 సంవత్సరంలో ఐయ్యారీ మూవీ నటించగా అది విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ఆ తరువాత కార్తీ దేవ్ సినిమా కూడా ఫ్లాప్‌గా నిలిచింది. తమిళ హీరో సూర్యతో NGK, కింగ్ నాగార్జున మన్మధుడు-2 కూడా నిరాశే మిగిల్చాయి. ఇక సౌత్ వర్కౌట్ కావడం లేదని బీటౌన్లోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ.. ఇక దేదే ప్యార్ దే సినిమా మాత్రం కొంత ఊరట ఇచ్చినప్పటికీ.. అది తన కెరీర్‌కు ఉపయోగపడలేదనే చెప్పాలి.
ట్రాక్ మార్చాలని గ్లామర్ పాత్రలు కాకుండా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కొండపొలం మూవీలో డీ గ్రామర్ పాత్ర చేసింది. అయితే ఆ సినిమాకు అవార్డు వచ్చినప్పటికీ కలెక్షన్లు పరంగా దారుణంగా విఫలమైంది. దీంతో ఆమె కెరియర్ ప్రశ్నార్ధకంగా మారింది. ఇక ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న టాలీవుడ్లో నితిన్ సినిమా చెక్ చేసింది. చివరికి ఆ మూవీ కూడా రకుల్‌కు బ్రేక్ ఇవ్వలేకపోయింది. ఇక సౌత్, బాలీవుడ్లో నిరాశే మిగలడంతో కెరీర్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు.. గత కొద్ది సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్న తన ప్రియుడు జాకీ భగ్నానీని ఇటీవల పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని ప్రారంభించింది.