Tollywood Movies Releases This Friday: శుక్రవారం వస్తుందంటే చాలు సినీ ప్రేమికులకు పండుగేనని చెప్పాలి. ప్రస్తుతం బిజీ బిజీ లైఫ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి మూడు గంటలు పాటు అలా వినోదాన్ని పొందేందుకు ఎదురుచేసేవాళ్లు ఎందరో. ఇక ప్రత్యేకించి తమ అభిమాన హీరో సినిమా అయితే వారి రచ్చ మామూలుగా ఉండదు మరీ. ఇక్కడ కొన్ని వారాలు చప్పగా సాగితే.. కొన్ని వారాలు అద్భుతమైన సినిమాలతో హ్యాపీగా గడుస్తుంటుంది. అయితే ఈ వారం రాబోతున్న మూడు సినిమాలు వేటికవే ప్రత్యేకంగా నిలవడంతో అందరి దృష్టి ఆ సినిమాలపై పడింది.
(( దీనిపై ఓ లుక్కేయండి:: ప్రభాస్ డూప్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎంతో తెలుసా? ))
మూడు సినిమాలు..
ఈ వారం ధియేటర్లో మూడు సినిమాలు డిఫరెంట్ జోనర్లతో వస్తుండడంతో మూవీ లవర్స్ కు పండగనే చెప్పాలి. మార్చి 8న తెలుగులో గామి, భీమా, ప్రేమలు సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న గామి మూవీ ఎట్టకేలకు థియేటర్లోకి రావడానికి సిద్ధమైంది. 2017లో ఈ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయగా.. 2018 లో షూటింగ్ మొదలైంది. దాదాపు 6 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం విశ్వక్ సేన్ కెరీర్లో ఓ మైలురాయి కానుంది.
ఇక చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి నూతన దర్శకుడు విద్యాధర్ కాగితా దర్శకత్వం వహించాడు. కథలో కొత్తదనం, మూవీ ట్రైలర్ కూడా అదిరిపోయే లెవల్లో ఉండడంతో ఈ మూవీపై హైప్ మామూలుగా లేదనే చెప్పాలి. మరికొందరు ఇంత తక్కువ బడ్జెట్లో ఈ స్థాయి ఔట్పుట్ అంటే మామూలు విషయం కాదని ప్రశంసిస్తున్నారు.
భీమాతో హిట్ పక్క
మ్యాచో హీరో గోపీచంద్ భీమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు. డైరెక్టర్ హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో కన్నడలో మాస్ సినిమాలకు హర్ష తన మార్క్‌ను చూపించాడు. గోపిచంద్‌కి మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి కాంబోలో వస్తున్న భీమా ఏ మేరకు విజయాన్ని సాధిస్తుందో చూడాలి. కటౌట్ కి తగ్గిన సినిమా పడితే పక్కా హిట్ పడుతుందని.. అది కూడా భీమా సినిమాతోనే అని చిత్ర యూనిట్‌తో పాటు పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక భీమా ట్రైలర్ చూస్తే గోపీచంద్ మాస్ పొటెన్షియల్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు అని అనిపిస్తోంది. ఈసారి ఎలాగైనా హిట్టు కొడితే చూడాలని తమ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఆ సినిమాలకు గట్టి పోటీగా ప్రేమలు..!
మలయాళంలో ఈ ఏడాది బ్లాక్ బస్టర్లు వరుసగా వస్తున్నాయి. లవ్- రొమాంటిక్- కామెడీ మూవీగా వచ్చిన ప్రేమలు సినిమా మలయాళం లో సూపర్ హిట్ అందుకుంది. భారీ కలెక్షన్స్ తో సెన్సేషనల్ క్రియేట్ చేసిన ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ కానుంది. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ నెల 8న ఈ మూవీని తెలుగులో విడుదల చేయనున్నాడు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకించడంతో తెలుగులోను ప్రేమలో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం తెలుగులో కూడా హిట్ కొట్టడం పక్కా అంటూ టాక్ వినిపిస్తోంది.