Mamitha Baiju: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా గుర్తింపు సంపాదించాలంటే అంత ఈజీ కాదు.. చాలా కష్టాలతో పాటు టైం కూడా పడుతుంది. అయితే కొంతమంది తారలు మాత్రం ఓవర్ నైట్ స్టార్స్‌గా మారిపోతుంటారు. చేసింది రెండు మూడు సినిమాలైన సరే… జస్ట్ ఒక సినిమాతో ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న వారు ఉన్నారు. అలా ఓవర్ నైట్ లో స్టార్ అయిన ముద్దుగుమ్మల్లో మలయాళీ భామ చేరింది.
((దీనిపై ఓ లుక్కేయండి: విడాకుల తర్వాత మొదటిసారి స్టేజి మీద చై-సామ్! ))
తన స్మైల్ తో, సింప్లిసిటీతో, నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే టాలీవుడ్ మొత్తాన్ని ఊపేస్తుంది. అంతేకాదండోయ్ ఏకంగా దర్శకధీరుడు రాజమౌళి చేత కూడా ప్రశంసలు అందుకుంది. ఇంతకీ ఎవరు ఆ బ్యూటీ ? ఓవర్ నైట్ స్టార్ కథ ఏంటి ? ఇప్పుడు చూద్దాం..
ఒక్క సినిమాతో..యువతరం కలల రాణిగా
2017లో మలయాళీ ఇండస్ట్రీలో సర్వోపరి పాలక్కారన్ సినిమాతో మమత బైజు సినీ కెరియర్ ను ప్రారంభించింది. మలయాళంలో దాదాపు 15 సినిమాలు చేసినా రాని గుర్తింపు ప్రేమలు మూవీతో వచ్చింది. తన కెరియర్ మొత్తాన్ని టర్న్ చేసిందీ చిత్రం. మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మూవీ ప్రేమలు. తెలుగులో కూడా రిలీజైన ఈ మూవీ అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకుంది. ముఖ్యంగా ఈ మూవీలో సాప్ట్ వేర్ ఉద్యోగి రీను పాత్రలో మమిత తనదైన లుక్స్, నటనతో మెస్మరైజ్ చేసింది. సినిమాకు మెయిన్ హైలెట్‌గా కూడా నిలిచింది. యువతరం కలల రాణిగా మారిపోయింది.
చాలా గ్యాప్ తర్వాత సక్సెస్..
ఎన్నో సినిమాలు చేసినప్పటికీ మమిత బైజుకి(Mamitha Baiju) సరైన గుర్తింపు మాత్రం రాలేదు. ప్రేమలు ఒక్క సినిమాతో అటు మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ అమ్మడు. మొన్న మొన్నటి వరకు కుర్రకారుకి నాచురల్ బ్యూటీ అంటే సాయి పల్లవి అని అనేవారు. ప్రస్తుతం ఈ తరహా గుర్తింపే మమతి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు గురించి తెగ వెతుకుతున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రమోషన్ లో చీరలో పాల్గొనడంతో ఆమెను సాయి పల్లవితో పోలుస్తూ తెగ ప్రమోట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఈవెంట్లో అలా చేసేసరికి..
ప్రేమలు ఈవెంట్లో ఓ అభిమాని మమితకు తన అభిమానాన్ని విచిత్రంగా ప్రదర్శించాడు. ప్రేమలు చిత్రం చాలా బాగుందని, తన నటన ఎంతో నచ్చిందని చెప్తూ స్టేజ్ ఎక్కి ఓ పళ్లెంలో హారతి వెలిగించి మరి మమితకు హారతి ఇచ్చాడు. దీంతో హీరోయిన్స్ తో పాటు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, ఆ ప్రెస్ మీట్ కి వచ్చిన వాళ్లంతా షాక్ అయ్యారు. ఇక ప్రేమలో మూవీ తర్వాత ఈ అమ్మడికి తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఆఫర్లు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ భామ రెబల్ అనే చిత్రంతో కోలీవుడ్ లోకి సైతం ఎంట్రీ ఇవ్వబోతోంది. కేవలం ఒక్క హిట్ తోనే ఇలాంటి క్రేజ్ ను సంపాదించుకుంది అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.