Sunrisers Hyderabad Captain Response After Loss With Kkr: ఐపీఎల్-2024 మొదటి షెడ్యూల్లో భాగంగా మ్యాచ్‌లు మొదలయ్యాయి. శనివారం ( మార్చి 23) రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్ వెర్సస్ కోల్కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ క్రికెట్ లవర్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ని అందించింది. మ్యాచ్ నీదా నాదా అన్నట్లు సాగి.. ఓ దశలో హైదరాబాద్ గెలిచిపోతుందని అనుకున్నారంతా. అయితే చివరి ఓవర్లో హర్షిత్ రానా అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ని మలుపు తిప్పాడు. చివరికి ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.
(( దీనిపై ఓ లుక్కేయండి: నెట్టింట ఒకటే రచ్చ.. ధోనికిదే లాస్ట్ ఐపీఎల్.. అందుకు ఇదే సాక్ష్యం..! ))
అతని వల్లే ఓటమి
ఈ మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సారథి ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ..సన్‌రైజర్స్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన ప్రదర్శించింది అయితే తమ జట్టుకు అదృష్టం కలిసిరాలేదని తెలిపాడు. మొదటగా బౌలింగ్ ఎంచుకుని ఒకానొక దశలో మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని తాము ప్రద్శించామని.. కేకేఆర్‌ని తక్కువ స్కోరుకే కట్టిడి చేసే అవకాశం దొరికిందన్నాడు.
అయితే ఆండ్రూ రస్సెల్ భీకర బ్యాటింగ్‌తో మా ప్రణాళికలు మారిపోయాయి అన్నాడు. అప్పటి వరకు ఉన్న మ్యాచ్ గణాంకాలను రస్సెల్ పూర్తిగా చెరిపేశాడని చెప్పుకొచ్చాడు. అతని బ్యాటింగ్‌తో స్కోరు బోర్డు పరుగులు పెట్టించడమే కాదు.. భారీ టార్గెట్‌ని సన్‌రైజర్స్ ముందు ఉంచాడని తెలిపాడు. మ్యాచ్ విన్నింగ్ చాలా దగ్గర అయ్యాం. ఓవరాల్‌గా మా జట్టు మెరుగైన ప్రదర్శనే కనబరిచింది. ప్రణాళికలు కూడా కట్టుదిట్టంగా అమలు చేశాం. దురదృష్టవశాత్తు గెలుపు అంచుల వరకు వెళ్లి ఓటమి చవిచూడాల్సి వచ్చిందని తెలిపాడు.
అటు రస్సెల్.. ఇటు క్లాసెన్ అదరగొట్టారు
కేకేఆర్ భారీ స్కోరు అందించడంతో రస్సెల్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే .. జట్టులో క్లాసెన్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. జట్టుని విజయతీరాలకు చేర్చేందుకు తనవంతు కషి చేశాడు. 200 పైగా ఉన్న స్కోరుని చేధించేందుకు బరిలో దిగిన హైదరాబద్ ప్లేయర్లు ఆరంభం అదరగొట్టారు. అయితే ఓపనర్లు వికెట్లు కోల్పోవడంతో.. మిడిల్ బ్యాటర్లు విఫలం కావడంతో మ్యాచ్ మీద ఆశలు సన్నగిల్లాయి.
నెట్‌రన్‌రేట్ కూడా పెరుగుతూ మ్యాచ్‌ని కేకేఆర్ వైపు తీసుకెళుతోంది. అయితే ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన క్లాసెన్ బంతులను బౌండరీలకు తరలించడం మొదలుపెట్టాడు.దీనికి తోడు అవతలి ఎండ్‌లో ఉన్న షెహ్బాజ్ నుంచి కూడా అతనికి సహకరించాడు. వీరిద్దరూ కలిసి మ్యాచ్ స్వరూపాన్నే మర్చేశారు. అయితే దురదృష్టవశాత్తు తమ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. బౌండరీలతో అదరగొట్టిన హెన్రీచ్ క్లాసెన్ కేవలం 29 బంతుల్లో 8 సిక్స్‌లతో 63 పరుగులు రాబట్టాడు.
అంతకు ముందు బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ ఆండ్రూ రస్సెల్(25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 64 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ విన్నింగ్‌కు దగ్గరగా వచ్చినప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులే చేసి ఓటమిపాలైంది.