Tillu Square Movie Review in Telugu:సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సిద్దూ…డిజే టిల్లుగా ఈ పాత్రతో ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడనే చెప్పాలి. ప్రత్యేకంగా ఈ క్యారెక్టర్, డైలాగ్స్, యూత్‌కి తెగ నచ్చేశాయి. దీంతో రెండో భాగం కూడా ప్లాన్ చేసిన మేకర్స్.. తాజాగా ఆడియన్స్ ముందుకు తీసుకవచ్చారు. గ్రాండ్ హిట్ అందుకున్న మూవీకి స్వీక్వెల్ వచ్చిన టీల్లు స్క్వయర్ ప్రేక్షకులకు నచ్చిందా.. సిద్దు జొన్నలగడ్డ మరో సారి టిల్లన్నలా మెప్పించాడా అన్నది చూద్దాం.
కథ ఇదే
గతంలో రాధిక(నేహా శెట్టి) చేసిన మోసం గురించి ఆడియన్స్‌కు తెలిసిందే. దీని నుంచి బాల గంగాధర తిలక్ అలియాస్ డీజే టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) మెల్లగా కోలుకుంటూ తన కుటుంబం, దోస్త్లంటూ గడుపుతూ.. మళ్లీ‘టిల్లు ఈవెంట్స్’ స్టార్ట్ చేసి ఆ పనిలో బజీగా ఉంటాడు. ఇలా లైఫ్ హ్యాపీగా సాగుతున్న టిల్లు జీవితంలోకి లిల్లీ(అనుపమ పరమేశ్వరన్) సడన్ ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూడగానే టిల్లు మనసు పారేసుకుంటాడు.
ఇక లిల్లీతో ఆ మాట, ఈ మాట చెప్పి చివరికి.. ఆమెతో ఓ రాత్రంతా గడుపుతాడు. ఉదయం లేచి చూస్తే లిల్లి కనిపించదు. కొన్ని రోజుల తర్వాత ఓ ఆసుప్రతిలో కనిపించిన లిల్లీ.. తాను గర్భవతి అని చెప్పి షాక్ ఇస్తుంది. అక్కడి నుంచి టిల్లుకి షాక్‌లు మొదలవుతాయి. గతంలో రాధిక తరహాలోనే .. ఇప్పుడు ఈ లిల్లితో టిల్లుకి వచ్చిన కొత్త సమస్యలు ఏంటి? వీటితో పాటు వీళ్ళ కథలోకి పేరు మోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలీ(మురళీ శర్మ) కి వస్తాడు.. అతనికి దీనికి లింక్ ఏంటి? అనేది ఈ మూవీ స్టోరీ.
ఎలా ఉంది..
‘డీజే టిల్లు మూవీకి మెయిన్ హైలెట్ టిల్లు క్యారెక్టర్. టిల్లు డైలాగులు, పలికే విధానం, యాస్, అతను ఇచ్చే ఎంటర్టైన్మెంట్.. ఈ సినిమాకు భారీ వసూళ్లతో పాటు క్రేజ్‌ని తెచ్చిపెట్టాయి. కథలో అంత కొత్తథనం లేకపోయినా కేవలం టిల్లుగాడి మాటలు, మ్యానరిజం.. ఈ మూవీకి విపరీతమైన క్రేజ్‌ని సంపాదించి పెట్టింది. అందుకే దీనికి స్వీక్వెల్‌గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’లోనూ అదే ఫార్ములానే అప్లై చేశారు దర్శకరచయితలు. కథ కంటే టిల్లు, లిల్లిల కారెక్టరైజేషన్స్ను నమ్ముకుని మూవీని తెరకెక్కించారు.
ఈ మూవీ పార్ట్ 1 తరహాలోనే పార్ట్ 2లో కూడా లాజిక్స్ మిస్ అయ్యాయి. అయితే అవేవి ఆడియన్స్ బుర్రలోకి ఎక్కకుండా టిల్లుగాడు తన మ్యానరిజంతో కప్పిపుచ్చుతాడు. మధ్యలో వచ్చే కొన్ని ట్విస్టులు బాగున్నా కొన్ని మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. అయితే చివరికి డైరెక్టర్ అనుకున్నట్లుగానే ఎంటర్టైన్మెంట్, ట్విస్టులు, టిల్లు గాడి మ్యానరిజం, లిల్లి వీటి మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.
రవితేజ మూవీ, సడన్‌గా అలా అన్నారు.. బాత్రూంకి వెళ్లి ఏడ్చేశాను!
ఎవరెలా చేశారంటే..
టిల్లుగాడి పాత్రలో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన తీరు ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. ప్రత్యేకంగా యూత్‌లో టిల్లుగాడి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. గతంలో ఈ పాత్రను చేసి ఆడియన్స్‌తో విజిల్స్ వేయించిన క్యారెక్టర్ కాబట్టి సిద్దూ ఈ సారి కూడా చాలా ఈజీగా ఆ పాత్రని అదరగొట్టాడు. ఫార్ట్ 1 మాదిరి మ్యానరిజం, డైలాగ్ డెలివరీ ఈ మూవీ స్థాయిని పెంచడంతో పాటు హైలెట్‌గా నిలుస్తాయి.
అనుపమ పరమేశ్వరన్ ప్రమోషన్ కార్యక్రమంలో చెప్పినట్లు ఇందులో కొత్త తరహా పాత్రను పోషించింది. ఈ మూవీ చూస్తే అనుపమ గతంలో ఇలాంటి పాత్రలో నటించలేదే అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక లిల్లి క్యారెక్టర్లో నటనతో పాటు గ్లామర్ షోతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ట్విస్టులు ఆకట్టుకుంటాయి. టిల్లు తండ్రిగా మురళీధర్ గౌడ్ పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. మురళీ శర్మ, ప్రిన్స్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికంగా ఈ మూవీ ఆడియన్స్‌కు నచ్చుతుంది. ముఖ్యంగా పాటలకు అదిరిపోయాయి. భీమ్స్ ఆర్ఆర్ ఈ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. కెమెరా వర్క్ రిచ్‌గా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఈ మూవీ స్థాయికి తగ్గట్లు ఉన్నాయని అనిపిస్తుంది.