Bade Miyan Chote Miyan: బాలీవుడ్ మూవీ బడే ‘మియాన్ చోటే మియాన్’ కు యాక్షన్ సన్నివేశాలను ప్రముఖ స్టంట్ కొరియోగ్రఫీర్ క్రైజి మక్రయ్ అందించారు. గతంలో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రాలైన పఠాన్, జవాన్ లకు ఫైట్స్ కంపోజ్ చేశారు. తాజాగా యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న బడే మియా చోటే మియాన్ మూవీకే అదే స్థాయిలో తగ్గేదేలే అన్న విధంగా యాక్షన్ ఎపిసోడ్స్ ను కంపోజ్ చేశారు.
‘టిల్లు స్క్వేర్’ మూవీ రివ్యూ.. మరో సారి టిల్లుగాడి మ్యాజిక్ పనిచేసిందా?
ఇటీవల రిలీజైన ఈ మూవీ ట్రైలర్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ఫైట్స్ చూస్తే క్రైజి మక్రయ్ పని తీరు మనకు కనిపిస్తుంది. బడే మియా చోటే మియాన్ చిత్ర ట్రైలర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. కాగా మార్చి 26న ఈ మూవీ ట్రైలర్ ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో పాటు కన్నడ భాషల్లో కూడా విడుదల చేశారు.
పూజా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుంచి ఈ మూవీ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతోంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో అంచనాలతో ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లోకి వచ్చి సందడి చేయనుంది. భారీ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఇందులో ఉత్కంఠని పెంచే కథాంశం, నటీనటుల పెర్ఫామెన్స్, హై ఆక్టన్స్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో నిర్మాణం జరుపుకోవడంతో ఆడియన్స్ ఈ మూవీని ఆదరిస్తారని చిత్ర యూనిట్ భావిస్తోంది.
విజువల్ వండర్
బడే మియా చోటే మియాన్లో (Bade Miyan Chote Miyan) ఇద్దరూ హీరోలు ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టడంతో పాటు.. సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే సన్నివేశాలతో సిద్ధంగా ఉన్నారు. ఇందులో రోలర్ కోస్టర్ రైడ్ లాగా థ్రిల్ ఫీలయ్యే సన్నివేశాలు ఎమోషనల్ సీన్స్ ఇలా ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అవన్నీ అందించే విజువల్ వండర్లా ఈ మూవీని తీర్చిదిద్దినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు.
వశు భగ్నానీ, పూజా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఏఏజెడ్ ఫిలిమ్స్ సంస్థ అసోసియేషన్ లో బడే మియా చోటే మియా మూవీని ప్రజెంట్ చేస్తున్నాయి. అలీ అబ్బాస్ జాఫర్ రచన దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రంజాన్ కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, మానుషీ చిల్లర్, ఆలయ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా కూడా ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.