Etv Win: Sharma And Ambani Trailer Out Now: ఇటీవల వస్తున్న సినిమాల్లో కామెడీ ఎంటర్టైనర్లకు క్రైమ్ జోనర్ తోడైతే ఆ చిత్రాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. అదే తరహాలో తాజాగా శర్మ అండ్ అంబానీ అనే సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేరాఫ్ కంచరపాలెం కేశవ కర్రీ ప్రధాన పాత్రలలో ఇందులో కనిపించనున్నారు.
ఈ మూవీ ఈటీవీ విన్ యాప్ లో ఏప్రిల్ 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల మనమే రాజా అనే పాట రిలీజ్ చేయగా.. ఆదిత్య మ్యూజిక్ ఛానల్ లో ఆ సాంగ్ వన్ మిలియన్ వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులో శర్మతో పాటు అంబానీల జీవితాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు శర్మ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అయితే అతని స్నేహితుడు అంబానీ మాత్రం షూ క్లీన్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఒక గ్యాంగ్ కి సంబంధించిన డైమండ్స్ మిస్ కావడంతో వీరి జీవితాలు తారుమారు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక శర్మ అంబానీ జీవితాల్లో జరిగిన అనుకోని పరిస్థితులు ఎలాంటి పరిస్థితులకు దారి తీసాయి అనేవి ట్రైలర్లు ఆసక్తికరంగా చూపించారు.
ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఇప్పటికే మూవీపై ఆసక్తి పెంచేసింది. ఈ చిత్రానికి కార్తీక్ సాయి దర్శకత్వం వహిస్తుండగా… అనిల్ పల్లాతో కలిసి భరత్ తిప్పిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ స్క్రిప్ట్ వర్క్‌ని భరత్ తిప్పిరెడ్డితో కలిసి అనిల్ రెడీ చేశారు. మానస్ అద్వైత్, రాజశేఖర్ నర్జాల, విశ్వనాథ్ మండలిక, యష్, రూపక్ , హనుమంతరావు వంటి నటులు ఇతర పాత్రలో కనిపించనున్నారు. శర్మ అండ్ అంబానీ మూవీకి కె.ఎ.స్వామి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, గౌతం రాజ్ నెరుసు ఎడిటర్‌గా, సంగీతం విషయానికొస్తే శశాంక్ ఆలమూరు – మహా బాణీలు అందించారు.