Dear Uma Movie: ప్రస్తుత రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశం రావలంటే కష్టమనే చెప్పాలి. ఇక తెలుగు అమ్మాయిలు నటిగా ఛాన్స్ అనేది అంత ఈజీ కాదన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఓ తెలుగు అమ్మాయి హీరోయిన్గా అవకాశం దక్కించుకోవడమే గాక తన మొదటి సినిమాతోనే నిర్మాతగా మారడం, కథను అందిస్తోంది ఈ అమ్మడు. ఆ తెలుగు అమ్మాయే సుమయా రెడ్డి.. తన నటిస్తున్న సినిమా డియర్ ఉమ. అడుగు పెట్టిన మొదట్లొనే.. అన్నీ తానై ఓ లేడీ బాస్‌గా డియర్ ఉమ మూవీని ముందుకు నడిపిస్తోంది ఈ భామ. ఈ చిత్రంతో సుమయా రెడ్డి ఇండస్రీలో తన లక్‌ని పరీక్షించుకోబోతోంది.
ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి లేటెస్ట్ లీక్.. ఫ్యాన్స్‌కి పూనకాలు గ్యారెంటీ!
సుమయా రెడ్డి, పృథ్వీ అంబర్ ప్రధాన పాత్రల్లో డియర్ ఉమ తెరకెక్కుతోంది. ఈ మూవీని సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద సుమయా రెడ్డి నిర్మిస్తోంది. సాయి రాజేష్ మహాదేవ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇప్పటికే మార్కెట్లో విడుదలైన డియర్ ఉమ పోస్టర్లు, టీజర్, నవ్వుతుంటనే లిరికల్ వీడియో సాంగ్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలోని ఫీల్ గుడ్ ఎమోషన్‌కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. యూత్ ఆకట్టుకునే విధంగా లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందిన డియర్ ఉమ చిత్రం Dear Uma Movie .అందరినీ ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
సుమయా రెడ్డి పుట్టిన రోజు (మే 18) సందర్భంగా యూనిట్ సభ్యులు… ఈ లేడి బాస్‌కు స్పెషల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తమ లేడీ బాస్‌కు చిత్రయూనిట్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం డియర్ ఉమ మూవీ షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదిని ప్రకటించనున్నారు.