T20 World Cup 2024.. ఆటలో వేగం పెంచడంతో పాటు.. దాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో దాదాపు రెండు దశాబ్దాలకు ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పొట్టి ఫార్మాట్‌కు అంకురార్పణ చేసింది. మూడున్నర గంటల్లో ముగిసే మ్యాచ్‌లకు మంచి ఆదరణ దక్కడంతో.. 2007లో తొలిసారి టీ20 ఫార్మాట్లో ప్రపంచకప్ నిర్వహించింది. ఇక అప్పటి నుంచి ధనాధన్ ఆటతీరు ప్రజలకు బాగా చేరువైంది. ఒక సినిమా పూర్తయ్యేంతలో మ్యాచ్ ముగుస్తుండటంతో.. అభిమానులు సైతం దీనికి జై కోట్టారు. దీంతో ఈ ఫార్మాట్లో ప్రతి రెండేళ్లకోసారి ఐసీసీ వరల్డ్‌కప్ నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటివరకు ఎనిమిది సార్లు టీ20 ప్రపంచకప్ జరగగా..
మరో రెండు రోజుల్లో తొమ్మిదో వరల్డ్‌కప్‌నకు తెరలేవనుంది. క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయాలనే లక్ష్యంతో ఈ సారి మెగాటోర్నీలో 20 జట్లకు అవకాశం ఇచ్చారు. ఆతిథ్య హోదాలో అమెరికా గ్రూప్ నుంచి బరిలోకి దిగనుంది. యూఎస్ఏ జట్టు ఏ ఫార్మాట్లోనైనా ప్రపంచకప్ ఆడటం ఇదే తొలిసారి కాగా.. దాదాపు 5 కోట్ల మంది క్రికెట్ అభిమానులు ఉన్న అగ్రరాజ్యం.. ఆగమనాన్ని ఘనంగా చాటాలని భావిస్తోంది. 2028 లాస్ఏంజిల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేయడం కూడా ఆ దేశంలో జెంటిల్మెన్ గేమ్‌కు అదనపు క్రేజ్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో..
ప్రపంచకప్‌లోని 16 మ్యాచ్‌లను అమెరికాలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. మెగాటోర్నీకి ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్ కైవసం చేసుకున్న అమెరికా.. పొట్టి ప్రపంచకప్‌లో తామూ ప్రమాదకారులమే అని చాటు కుంది. యూఎస్ జట్టుకు మోనాంక్ పటేల్ సారథిగా వ్యవహరిస్తుండగా.. అలీ ఖాన్, హర్మీత్ సిం గ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, సౌరభ్, జహంగీర్ ఇలా పలువురు భారతీయు లు టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. టీమిండియాను విపరీతంగా ఆరాధించే అమెరికా ప్లేయ ర్లు.. జూన్ 12న జరగనున్న మ్యాచ్‌లో రోహిత్ సేనతో అమీతుమీ తేల్చుకోనున్నారు.
Read More: T20 World Cup 2024: మెగాటోర్నీకి వేళాయే.. అమెరికా పిలుస్తోంది
ఉత్తర భారతీయులు అధికంగా స్థిరపడ్డా కెనడా.. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో అడుగులు వేస్తోంది. 19వ శతాబ్దంలోనే అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన చరిత్ర ఉన్న కెనడా.. ఆ తర్వాత క్రికెట్‌ను పెద్దగా పట్టించుకోలేదు. 1979 వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన కెనడా.. ఆ తర్వాత 2003 వరకు మరోసారి ఆ ఘనత దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత నిలకడగా విజయాలు సాధిస్తూ వస్తున్న కెనడా 2007, 2011 ప్రపంచకప్‌లకు నేరుగా అర్హత పొందింది. 2018లో ఐసీసీ అన్నీ టీ20 మ్యాచ్‌లకు అంతర్జాతీయ హోద ప్రకటించగా.. 2023 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తాచాటిన కెనడా వన్డే హోదాను తిరిగి పొందింది.
Read More: IPL 2024: పరుగుల వినోదంలో మెరుపులు.. మరకలు చూసేద్దామా