Best Tips To Reduce Snore: ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో గురక అనేది ముఖ్యమైన సమస్యగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిని పెద్దది అని భయపడలేం అలా అని చిన్నది అని పక్కన పెట్టలేం. ముఖ్యంగా ఈ గురక వల్ల బాధపడుతున్న వారికి తెలుస్తుంది దీని ప్రభావమేంటనేది.
ఇళ్లలో పెద్ద – చిన్న అని తేడా లేకుండా ఈ సమస్య వేధించే అవకాశం ఉంది. ఇది సాధారణ సమస్య అయినప్పటికీ దీని లైట్ గా తీసుకుంటే డేంజర్ జోన్ లో పడ్డట్టే అంటున్నారు వైద్యులు. అసలు గురక ఎందుకు వస్తుంది? గురకరాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ సమస్యకి పరిష్కారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సమ్మర్లో ఐస్ క్రీం తెగ తినేస్తున్నారా.. ఈ షాకింగ్ విషయాలు మీకోసమే!
అలా వస్తుంది
గురక అనేది చాలామంది వ్యక్తులలో తరచుగా వచ్చే సమస్య. 25-65 సంవత్సరాల మధ్య పురుషులలో గురక వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా 30 ఏళ్ల లోపు వారిలో సుమారు 10% మంది, 60 దాటిన వారిలో 60% మంది గురక పెడుతుంటారు. సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో స్వాస తీసుకోవడం వదలడం చేస్తుంటాం. అలా జరుగుతున్న క్రమంలో మెడ, తలలోని కణజాలంలో కంపనాలు ఏర్పడడం వల్ల గురకలు పెడుతుంటాం.
గురక ఎందుకు వస్తుంది ?
సాధారణంగా మనం నిద్రించే సమయంలో గాలి ముక్కు నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే అప్పుడు గురక వస్తుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నోటి ద్వారా శ్వాస తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ మార్గంలోనూ ఏవైనా అవాంతరాలు ఉంటే గాలి మరోవైపు ప్రయాణిస్తుంది. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న కణజాలు కదలికకు గురై చప్పుడు వస్తాయి. ఇది ఒక కారణం మాత్రమే.
గురక రావడానికి పలు కారణాలు
గురక రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మందు తాగే అలవాటు ఉన్నవారిలో, నాసిక సమస్యలు ఉన్నవారిలో, నిద్రలేమి సమస్య, స్లీపింగ్ పొజిషన్, బరువు ఎక్కువగా ఉన్నవారిలో గురక ఎక్కువగా వస్తుంది.
ఉపశమనానికి ఇది ట్రై చేయండి (Best Tips To Reduce Snore)
(1) తేనె :-
తేనె గురకను తగ్గిస్తుంది. కాబట్టి నిద్రపోయే ముందు తేనె, ఆలివ్ ఆయిల్ ను అరటీ స్పూన్ చొప్పున తీసుకొని రెండింటినీ కలిపి నిద్రపోయే ముందు తాగాలి.
(2) యాలకుల పొడి :-
ఒక గ్లాసు వేడి నీటిలో అరటీ స్పూన్ యాలకుల పొడి కలిపి నిద్రపోయే ముందు తాగినట్లయితే గురక సమస్యకు చెక్ పెట్టొచ్చు.
(3) పుదీనా :-
నిద్రలేమి సమస్యను, గురకను నివారించడంలో పుదీనా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. గోరువెచ్చని నీళ్లలో పుదీనా ఆకులు నానబెట్టి రాత్రి పూట నిద్రించే ముందు తీసుకోవాలి.
(4) నెయ్యి :-
నెయ్యి మూసుకుపోయిన ముక్కు రంధ్రాలను ఫ్రీగా చేస్తుంది. దీంతో గురక సమస్య తగ్గుతుంది.
(5) పిప్పర్మెంట్ ఆయిల్ :-
ఒక గ్లాస్ నీటిలో ఒకటి లేదా రెండు ప్రిపరిమెంట్ ఆయిల్ చుక్కలను వేసి రాత్రి నిద్రించే ముందు నోటిలో వేసుకొని పుక్కిలించాలి. ఇలా చేస్తే గురక తగ్గుతుంది.
పై తెలిపిన చిట్కాలు పాటించడం వల్ల గురకను తగ్గించుకోవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
గమనిక :- ఆయుర్వేద నివేదికలు, ఆరోగ్య నిపుణులు సూచనలు మేరకు మాత్రమే ఈ చిట్కాలను తెలియజేస్తున్నాం. ఎలాంటి సమస్యలున్నా వైద్యులను సంప్రదించడం ఎంతో ఉత్తమం.