Salaar Movie: రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి తరువాత డార్లింగ్ కి సరైన హిట్ లేదనే చెప్పాలి. సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్ సినిమాలు ఓపెనింగ్స్ అదరకొట్టిన బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం భారీ కలెక్షన్లను రాబట్టలేక పోయాయి. వీటి తరువాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో జత కట్టాడు ప్రభాస్. వీరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సలార్- సీజ్ ఫైర్’ డిసెంబర్ 22న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచి రికార్డ్ కలెక్షన్ల వైపు దూసుకెళ్తోంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఓ సమస్య ఎదురైయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీని ప్రభావం కలెక్షన్ల మీద చూపే అవకాశం ఉన్నట్లు సినీ పండితులు చెబుతున్నారు.
మొదటి వారం దుమ్ముదులిపింది..
డార్లింగ్ ప్రభాస్ మాస్ అప్పీల్, ప్రశాంత్ నీల్ ఎలవేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సలార్. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే రూ.178 కోట్ల గ్రాస్ అందుకొని 2023 లో హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న మూవీ గా రికార్డ్ సృష్టించింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా అదరగొడుతున్న సలార్ చిత్రానికి తెలుగు రాష్ట్రాలలో ఓ మేజర్ ఇష్యూ ఉందని కొందరి విశ్లేషకులు చెబుతున్నారు. అదే టికెట్ రేట్లు పెంచడం.సలార్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ చిత్రం విడుదలకి ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల పెంపు కోసం దరఖాస్తు చేసి… ఆ పై ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో టికెట్ రేట్లు భారీగా పెంచగా, ఏపీలో లో-క్లాస్ టికెట్ రేట్లు పెం
అయితే మొదటి వారం వరకు ఫ్యాన్స్ , సీనీ అభిమానులు ధరలతో సంబంధం లేకుండా చూస్తారన్న సంగతి తెలిసిందే. అయితే సలార్ లాంగ్ రన్ లో మరింత కలెక్షన్లను రాబట్టలంటే పెరిగిన టికెట్ రేట్లను కాస్త తగ్గిస్తే బెటర్. ఎందుకంటే పెరిగిన రేట్లతో సినిమాను చూడాలంటే సామాన్య ఆడియన్స్ కి కష్టమనే చెప్పాలి.
సలార్‌ను ఇవి ఆపనున్నాయా..?
ఓ వైపు నార్త్‌లో ఈ సినిమాని తొక్కేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. మరో వైపు కన్నడ ఇండస్ట్రీలో దర్శన్ నటించిన కాటేర చిత్రం విడుదలైంది. వీటి ప్రభావం సలార్‌పై కలెక్లన్లపై పడుతుంది. ఇటీవల ఎక్కువ టికెట్ రేట్లతో విడుదలైన పలు చిత్రాలు.. మొదటివారంలో కలెక్షన్లు బాగానే వచ్చాయి.అయితే రెండో వారం వీక్ డేస్ వచ్చేటప్పటికి మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ నెంబర్స్ అందుకోవడంలో విఫలమయ్యాయి. ఇప్పుడు సలార్ కి కూడా ఈ సమస్య ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. కనుక దీన్ని పరిగణలోకి తీసుకొని చిత్ర నిర్మాతలు వీక్ డేస్ నుంచి టికెట్ ధరలు తగ్గిస్తే బాగుంటుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ సలార్- సీజ్ ఫైర్ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు ఒక్కొక్కటి బద్దలు కొడుతోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటివరకు రూ. 500 కోట్లు కలెక్ట్ చేసింది. మరోవైపు సలార్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో చిత్ర యూనిట్ అంతా సంబరాల్లో మునిగితేలుతోంది.