Twitter Fight: నభా నటేష్ ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇస్మార్ట్ శంకర్ మూవీతో టాలీవుడ్ లో ఓ సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత ఓ యాక్సిడెంట్ వల్ల సినిమా తెరకు కాస్త గ్యాప్ ఇచ్చింది. అయితే మళ్లీ వెండితెరపై కనిపించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ నటుడు ప్రియదర్శికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో వార్తల్లో నిలిచింది. అసలు ప్రియదర్శి అంత పెద్ద తప్పు ఏం చేశాడు? మ్యాటర్ వార్నింగ్ వరకు ఎందుకు వెళ్ళింది? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వీడియో వైరల్
ఆక్సిడెంట్ తో సినిమాలకు కాస్త దూరం అయిన నభా నటేష్ మళ్లీ తెరపై కనిపించేందుకు ఆక్టివ్ గా మారింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రభాస్ వాయిస్ తో టిక్ టాక్ తరహాలో ఓ వీడియో చేసి పోస్ట్ చేసింది. 20 సెకండ్లు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ప్రభాస్ ఊతపదం డార్లింగ్ అన సంగతి మన అందరికీ తెలిసిందే. సినిమా అయితే నేమి, ఈవెంట్స్, టీవీ షోస్ లో ఇలా ప్రతి చోటా ప్రభాస్ డార్లింగ్ అనే పదాన్ని వాడుతుంటాడు. ఈ ఫేమస్ పదాలన్నింటినీ కలిపి నభా ఓ వీడియో చేసి నెట్టింట వదిలింది.
మాటల జాగ్రత్త అంటూ వార్నింగ్
ఈ వీడియోని చూసిన ఇటు నెటిజెన్లు అటు ప్రభాస్ ఫాన్స్ తో పాటు సెలబ్రిటీలు సైతం నభా పెట్టిన వీడియో మీద ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే హీరో ప్రియదర్శి స్పందిస్తూ.. సూపర్ డార్లింగ్, కిర్రాక్ ఉన్నావు డార్లింగ్ అంటూ కామెంట్స్ పెట్టాడు. దీంతో ఆమె ప్రియదర్శిపై ఫైర్ అవుతూ.. మిస్టర్ ఒకరిని కామెంట్ చేసే ముందు మాటలు జాగ్రత్త అంటూ మండిపడింది. ఇలా అమ్మాయిని డార్లింగ్ అని పిలిస్తే శిక్ష విధిస్తారని, మాటలు కాస్త జాగ్రత్తగా మాట్లాడు అంటూ ఫైర్ అయింది.
Read More: Urvashi Rautela: యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ.. దేవర సినిమాలో ప్రత్యేక పాత్ర?
ప్రియదర్శి రీ కౌంటర్ అదుర్స్.. (Twitter Fight)
నభా నటేష్ ఇచ్చిన వార్నింగ్ కామెంట్ ను చూసిన ప్రియదర్శిని అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. మీరేమో డార్లింగ్ అని పిలవచ్చు, వీడియో చేయొచ్చు.. మేం పిలిస్తే ఐపీసీ(IPC) సెక్షన్ పెడతారా లైట్ తీసుకో డార్లింగ్ అంటూ రీ రిప్లై ఇచ్చాడు. ప్రియదర్శి ఇచ్చిన కామెంట్ ను చూసి నభా నటేష్ మళ్ళీ కౌంటర్ ఇచ్చింది. గీత దాటద్దు.. చూసుకుందాం” అంటూ బదులిచ్చింది. దీనికి ప్రియదర్శి కూడా… “వై దిస్ కొలవెరి” అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. మొత్తానికి వీరిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఫన్నీ కాన్వర్జేషన్ అని తెలిసింది.
ట్విట్టర్ లో వీరిద్దరి మధ్య జరిగిన వార్ కాస్త ఫన్నీ అని తెలియడంతో నెట్టింట నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా సీనా.. ఇంకా ఏదో సీరియస్ అనుకుంటున్నామంటూ పలువురు కామెంట్స్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే నభా నటేష్ నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభు మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతుందని టాక్ వినిపిస్తోంది. ప్రియదర్శి సేవ్ ది టైగర్ సీజన్ టు సక్సెస్ తో టాలీవుడ్ లో మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. మంచి ఫామ్ లో ఉన్న ప్రియదర్శి ప్రస్తుతం హీరోగా కూడా ఓ సినిమా చేస్తున్నాడు.
చదవండి: రెస్పాన్స్ అదిరింది.. ఓటీటీలో రచ్చ చేస్తున్న రెండు సినిమాలు!