Health Tips: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో చాలా మంది ఛాయ్తోనే కాస్త ఉపశమనం పొందుతారు. కొంతమంది అయితే ఉదయం లేవగానే టీ లేకపోతే ఆ రోజు మొదలు కాదు, మరొకొందరికి ఉదయం నుంచి రాత్రి నిద్ర పోయే వరకు టీ తాగాల్సిందే. సహజంగా టీ తీసుకోవడం వల్ల క్యాన్సర్, డిమెన్షయా ప్రమాదాలను తగ్గించడంతోపాటు.. శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
ముఖ్యంగా మనకి పని ఒత్తిడి వల్ల కలిగే తలనొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. అల్లం టీ, తులసి టీ, యాలకుల టీ, పుదీనా టీ, మసాలా టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ ఇలా చెబుతూ పోతే బోలెడు రకాలు ఉన్నాయి. అలానే వాటికి సంబంధించిన ఉపయోగాలు కూడా ఉన్నాయి. లవంగంతో కూడా చక్కటి టీ తయారు చేస్తారని చాలా మందికి తెలియదు. అంతేనా ఈ “లవంగం-టీ ( clove tea ) తాగడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లవంగంలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా
వంటింట్లో ఉండే లవంగాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దగ్గు, జలుబు, పంటి నొప్పి, పొట్ట సంబంధిత సమస్యలకు సైతం రెండు లవంగాలు నోట్లో వేసుకుంటే సరి ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు ఇదే లవంగాలను మనం త్రాగే టీలో జత చేస్తే సరి.. గ్యాస్ గుండెల్లో మంట తగ్గడంతో పాటు, జీర్ణాసయ సమస్యలను కూడా నయం చేస్తుంది. భోజనం తర్వాత ఈ లవంగం టీని త్రాగితే అద్భుత ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
లవంగంలో ఉండే కే “విటమిన్లు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంతోపాటు సైనస్, జ్వరంను కూడా నయం చేస్తాయి. మన పూర్వీకుల కాలం నుండి కూడా ఈ లవంగాలను ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగించేవారు. లవంగంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల వాపును తగ్గించడానికి ఉపయోగపడతాయి. కొన్ని చర్మవ్యాధులను సైతం నయం చేస్తుందీ లవంగం టీ.
(ఇది కూడా చదవండి: మద్యం తాగుతున్నారా? శరీరంలో ఈ మార్పులు వస్తే ప్రమాదమే!)
ఈ లవంగం టీని ప్రతిరోజు తీసుకోవడం వలన రక్తపోటును కంట్రోల్ చేయడం, బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. శారీరక శక్తిని పెంపొందించడానికి, చర్మ సంబంధిత సమస్యలు నయం చేయడానికి ఈ టీ ఎంతో మేలు చేకూరుస్తుంది. ఈ రకంగా లవంగం టీ తాగడంతో మైండ్ కు రిలాక్సేషన్తో పాటు.. హెల్త్ బెనిఫిట్స్ కూడా బోలెడు ఉన్నాయనే చెప్పాలి.
మోతాదు మించితే డేంజర్
ఇలా లవంగాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటిని అధికంగా వాడకుండా పరిమితంగా ఉపయోగించుకోవాలని లేకపోతే అనర్ధాలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లవంగాలలో యూజినాల్ అని రసాయనం ఉన్నందువలన పరిమితంగా తీసుకోవాలి, లేకపోతే తలనొప్పి, కళ్ళు తిరగడం, బలహీనతతో పాటు నోటిపూత వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఈ లవంగం టీని రోజుకు కేవలం ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తీసుకోవాలి. పరిమితికి మించి తీసుకుంటే చిక్కుల్లో పడతారు. కాబట్టి పరిమితిలో మాత్రమే లవంగాలను, లవంగపు టీని తాగడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.