Health Tips: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దవాళ్లు. అలా ఉండాలంటే మన శరీరం శుభ్రంగా ఉండాలంటారు వైద్యులు. ఇందుకోసం మనం చాలానే జాగ్రత్తలు తీసుకుంటుంటాం.. అందులో నోటిని శుభ్రంగా ఉంచుకోవడం ఒకటి. అందుకే రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ద్వారా లైఫ్ టైం కూడా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
మన నిత్యం వాడే ప్రతి వస్తువుకు కాలవ్యవధి (Expiry Date) ఉంటుంది. దుస్తులు, చెప్పులు, తినే పదార్థాలు, శరీరానికి వాడే పౌడర్ నుండి వాడే పర్ఫ్యూమ్ వరకు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చిన్న వస్తువులు కూడా ఒక పరిమితి అనేది ఉంటుంది.
(ఇది కూడా చదవండి:: మద్యం తాగుతున్నారా? శరీరంలో ఈ మార్పులు వస్తే ప్రమాదమే!))
అలా కాలపరిమితి మించిన వస్తువులను ఉపయోగిస్తే అవి దుష్ప్రభావాలు చూపే అవకాశాలు ఉన్నాయి. ఈ జాబితాలోనే మన రోజూ పళ్లను శుభ్రపరుచుకునే బ్రష్ కూడా వస్తుంది. ఇంతకీ బ్రష్ ను ఎన్ని రోజులు వాడాలి? ఎన్ని రోజులకు బ్రష్ ని మర్చాలి? ఒకవేళ బ్రష్ ని మార్చకపోతే ఏ విధమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకుందాం.
బ్రష్ విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం
టూత్ బ్రష్ లు రెండు రకాలు ఉంటాయి. ఒకటి మనం నిత్యం చేతితో పట్టుకొని ఉపయోగించేవి ఒక రకమైతే.. మరొకటి ఎలక్ట్రిక్ బ్రష్. ఎలక్ట్రిక్ బ్రష్ లో అంతర్లీనమైన సెన్సార్లు కలిగి ఉండడంతో వైద్యుల సూచన మేరకు కొన్ని నిమిషాలు మాత్రమే వాడాలి. అంటే ఎక్కువ సేపు బ్రష్ చేస్తే దంతాలకు ఎఫెక్ట్ తప్పనిసరి. ఇక మనం మాములుగాచేతితో వాడే బ్రష్ విషయానికొస్తే.. ఏ రకమైన బ్రష్ ను వాడినా వెంటనే కడిగి పరిశుభ్రంగా పెట్టాలి.
వాడిని తర్వాత క్లోజ్ చేసి ఉన్న కంటైనర్ లో కాకుండా, తేమ ఆరిపోయే విధంగా బ్రష్ ను పెట్టాలి. ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి బ్రష్ ను మారిస్తే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. చాలామంది బ్రష్ అరిగిపోతేనో, వంగి పోతేనో బ్రష్ ను మార్చుతూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల చిగురు సంబంధిత సమస్యలతో పాటు, దంతాలు కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టూత్ బ్రష్ ను ఎప్పుడు మర్చాలి?
చాలామంది ఏ టూత్ పేస్ట్ వాడాలి? ఏది మంచిది? ఎలాంటి కలర్, ఎలాంటి స్ట్రక్చర్ ఉన్న బ్రష్ ను వాడాలి? అనే దాని గురించి ఆలోచిస్తారు. కానీ బ్రష్ కొనే ముందు బ్రష్ బ్రిస్టల్స్ ని చెక్ చేసి కొనాలని తెలుసుకోవాలి. మనం ఏదైనా దంత సంబంధ సమస్యలు ఎదుర్కొన్నట్లయితే.. తప్పనిసరిగా బ్రష్ చేయించాల్సి ఉంటుంది.
జ్వరం సమయంలో కూడా బ్రష్ ను మర్చడం ఉత్తమం, లేకుంటే అందులో ఉన్న బ్యాక్టీరియా బ్రష్లోను ఉండే అవకాశం లేకపోలేదు. అది మనం అనారోగ్యం నుండి కోలుకున్న తరువాత కూడా అదే మరల అదే బ్రష్ వాడడం వల్ల మళ్ళీ తిరిగి అనారోగ్య బారిన పడవచ్చు.
ఈ చిట్కాలు పాటించండి
(1)మనం వాడే బ్రష్ బ్రిస్టాల్స్ ను చెక్ చేసి సాఫ్ట్‌గా ఉన్న వాటినే ఎంపిక చేసుకోవాలి
(2)అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ కంపల్సరీగా తమ బ్రష్ ను చేంజ్ చేయాలి. లేనిచో మరోసారి అనారోగ్య బారిన పడే అవకాశాలు ఎక్కువ.
(3) బ్రష్ ఉపయెగించిన తర్వాత బ్రష్ ను తేమ లేకుండా తుడిచి పెట్టాలి. అలా చేస్తే బ్యాక్టీరియా పెరగడానికి ఛాన్స్ తక్కువ.
(4)ఎట్టి పరిస్థితుల్లో అయినా ఒకరు వాడిన బ్రష్, మరొకరు వాడకూడదు.
(5) బ్రష్ చేసినా అనంతరం బ్రష్ ను పరిశుభ్రంగా కడగడం ఉత్తమం
(6) ప్రతి రెండు వారాలకు ఒకసారి బ్రష్ ను వేడి నీటితో శుభ్రం పరుచుకోవాలి.