Health Tips: కోటి విద్యలు కూటి కొరకే అంటారు. మనం తీసుకునే ఆహారానికి అంత ప్రాముఖ్యత ఉంది కనుకే పెద్దలు అలా అన్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, బతుకు బండి నడవాలన్నా ఆహారం కీలకమనే చెప్పాలి. అలాంటి ఫుడ్ విషయంలో వంట నూనె ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ వంట చేయాలన్నా నూనె లేనిదే పని జరగదు.
కూర వేపుళ్ల దగ్గర నుండి చిరుతిండ్లు, పిండి వంటలు, నాన్ వెజ్, పకోడీ, బజ్జి, చిప్స్ వరకు ఏది చేయాలన్నా నూనె చాలా ముఖ్యమైనది. అయితే కొందరు ఈ నూనె విషయంలో చేస్తున్న పొరపాట్లు వల్ల మన ఆరోగ్యానికి ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు(Health Tips). అవి ఏంటంటే..
(ఇది కూడా చదవండి:: మద్యం తాగుతున్నారా? శరీరంలో ఈ మార్పులు వస్తే ప్రమాదమే!))
కుకింగ్ ఆయిల్.. ఇలా ఉపయోగిస్తే డేంజర్ సుమీ!
మనం వంట చేసుకోవడానికి పలు రకాల నూనెలు వాడుతుంటాం. అయితే బజ్జీలు, పకోడి, ఈ తరహా వంటలు చేసినప్పుడు కొన్ని సార్లు వాడిన నూనెను.. మళ్ళీ మళ్ళీ పదే పదే వినియోగిస్తే ఉంటాం. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎక్కువసార్లు ఉపయోగించిన నూనెను మళ్లీ తిరిగి వాడడం అసలు మంచిది కాదు. ముఖ్యంగా హోటల్, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన ఉన్న తినుబండారాలు దగ్గర నుండి ఉపయోగించిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతుంటారు.
అందుకే బయట ఫుడ్‌కి చాలా దూరంగా ఉండడంతో పాటు ఇంట్లో కూడా ఈ తరహా నూనె వాడే వాడకం నియంత్రించాలని లేకపోతే వ్యాధుల బారిన పడడం తప్పదని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా మీ కడుపు, గొంతులో ఆ మంటగా ఉన్నట్లు మీకు అనిపించిందా.. అది కూడా గతంలో పోలిస్తే ఈ తరహా మంట ఎక్కువగా ఉందా.. అయితే ఖచ్చితంగా వేడి చేసిన వంట నూనె దాని వెనుక కారణం కావచ్చు. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే.. రోడ్డు పక్కన జంక్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినడం మానుకోవడం ఉత్తమం.
ఆరోగ్య సమస్యలు
వాడిన నూనెను మరల ఉపయోగిస్తే గుండె జబ్బులు, లివర్ సమస్యలు, హైపర్ టెన్షన్, అల్జీమర్ వంటి వ్యాధులు వస్తాయని వైద్యులు వెల్లడించారు. చెడు కొలెస్ట్రాల్ పెరుగడంతోపాటు బీపి, కడుపులో మంట, గ్యాస్, ఉబకాయం, బరువు పెరుగుట కాలేయం సమస్యలు వస్తాయి. తాజాగా ఓ సర్వేలో వాడిన నూనెను రియూజ్ చేస్తున్న వారు దాదాపు 60 శాతం మంది ఉన్నారని తేలింది.
రీయూజ్ నూనె కంట్రోల్ టిప్స్
(1) మీరు నూనెను మరల ఉపయోగించాలి అనుకుంటే.. తక్కువ వేడితో మాత్రమే దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.
(2) కూర వేపుళ్లకు, అప్పడాలకు, వడియాలకు ఇలా ఏ వంటకైనా సరే నూనెను తక్కువ వాడుకోవడం ఉత్తమం
(3) తక్కువ నూనెలో డీప్ ఫ్రై చేసి చేసిన తదుపరి మిగిలిన నూనెను తిరిగి రెండు, మూడు రోజుల్లో మన వంటలకు ఉపయోగించుకోవాలి. అది కూడా ఒకసారి మాత్రమే.
(4) డీప్ ఫ్రై కి వాడిన నూనెను చల్లారిన తర్వాత వడకట్టాలి. ఇలా చేస్తే ఆయిల్ కాస్త శుభ్రపడడంతో పాటు ప్రమాద శాతాన్ని తగ్గిస్తుంది.