Health Tips In Telugu: ఈ రోజుల్లో దాదాపు ప్రతీ ఇంట్లో ఫ్రిజ్ మనకి కనిపిస్తుంది. ఆహార పదార్థాల నుంచి కూరగాయలు, కూల్డ్రింకులు అంటూ రకరకాలుగా వీటిలో నిల్వ చేస్తుంటాం. ఇందులో స్థలం ఉంటే చాలు తోసేయడమే.కొన్ని సందర్భాల్లో మహిళలు ఊరికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఇబ్బంది లేకుండా రెండు మూడు రోజులు సరిపడా వంటను తయారు చేసి మరీ ఫ్రిజ్‌లో పెట్టి వెళ్తుంటారు.
ఇక్కడ వరకు బాగానే ఉంది గానీ ఇలా ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం తింటే ఆరోగ్యానికి ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వినడానికి షాకింగ్ గానే ఉన్నప్పటికీ దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఫ్రిజ్ లో పెట్టిన కూరలు తినొచ్చా..? (Health Tips )
సాధారణంగా కూరగాయలు, పండ్లు వంటి ఫ్రెష్ గా ఉండడం కోసం ఫ్రిజ్‌లో పెడుతుంటాం. వీటితో పాటుగా కొందరు మిగిలిన కూరలు, అన్నం ఇలా రకరకాల పదార్థాలను వీటిలో నిల్వచేసి తినడం చేస్తుంటారు. కూరల్లో సాధారణంగా టమోటా, మసాలా దినుసులు జోడించిన వంటలను ఎక్కువసేపు ఉడికిస్తాం. కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అయితే మనకు నిల్వ ఉండాలని అనుకుంటే తక్కువసేపట్లో ఉడికించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా నాన్ వెజ్ వంటలు ఎక్కువసేపు మంటపై ఉండకూడదు. తక్కువ టైంలో ఈ వంటకాలను పూర్తి చేసుకోవడం ఉత్తమం.
అదేవిధంగా ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి అని అనుకుంటే కూర వండిన రెండు గంటల్లోపే.. ఒక టైట్ కంటైనర్‌లో కూర వేసి పెట్టుకోవాలి. అది కూడా మరుసటి రోజుకు తినేయాలి తప్ప.. అలానే ఎక్కువ సేపు ఉంచి తనకూడదు. ఎక్కువసేపు నిల్వ ఉంచిన ఆహారాన్ని మరల వేడి చేసి తినడం వల్ల పుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ కాలం నిల్వ చేసిన ఫుడ్‌ని తినడం వల్ల అజీర్ణం, డయేరియా వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే అప్పటికప్పుడే వండుకొని తినడం మంచిదని, ఫ్రిజ్ నిల్వ ఉంచిన ఆహారాన్ని పదే పదే తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
(ఇది కూడా చదవండి:: మద్యం తాగుతున్నారా? శరీరంలో ఈ మార్పులు వస్తే ప్రమాదమే!))
ఫ్రిజ్ లో ఇవి అస్సలు పెట్టకూడదు
* ఉడికించిన కోడి గుడ్డును ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా పెడితే పెద్దగా అయ్యి చీలిక ఏర్పడి గుడ్డులో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. కాబట్టి ఉడికించిన కోడిగుడ్డును ఫ్రిజ్ లో ఉంచకూడదు.
* ఉల్లిపాయలు కోసి ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఉల్లిపాయల వాసన ఇతర పదార్థాలకు అంటుకుంటుంది.
* బంగాళదుంపలను కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
* తేనె ఫ్రిజ్ లో ఉంచడం మంచిది కాదు. దీనివల్ల రుచి సైతం మారిపోతుంది. కాబట్టి బయట పెట్టుకోవడం మంచిది
* అరటి పళ్ళు ఫ్రిజ్‌లో పెడితే త్వరగా చెడిపోయి అవకాశం ఉంటుంది.
* రొట్టెలు, బ్రెడ్ వంటివి ప్యాకింగ్ చేసుకొని పెట్టుకోవాలి లేకపోతే గట్టి పడిపోతాయి.
* పచ్చళ్ళు బయటే పెట్టుకోవాలి లేదంటే అసలైన సువాసనలు కోల్పోతాయి. కొన్ని పచ్చళ్ళు బ్యాక్టీరియా, ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.
* ఫ్రిజ్‌లో ఉంచిన వెల్లుల్లిని వాడినా ఫలితం ఉండదు. రుచి వాసన కోల్పోతుంది.
* టమోటాలు సైతం ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఒకటి రెండు రోజులు ఉంటే పర్లేదు. కానీ చాలా రోజులు ఫ్రిజ్‌లో ఉంటే మాత్రం టమోటాకు ఉన్న సహజ లక్షణం కోల్పోతుంది. అంతేకాకుండా డిఎన్ఏ మిథైల్ సంశ్లేషణలో మార్పులు వస్తాయి.