Health Tips In Telugu: సీజన్ ఏదైనా చల్లగా ఫ్రిజ్ వాటర్ తాగడం కొంతమందికి అలవాటు. ఇలాంటి వాళ్లు బయట తిరిగి ఇంటికి చేరుకోగానే వెంటనే ఫ్రిజ్లో నుంచి చల్లని నీరు తీసి గడగడా తాగేస్తుంటారు. ఇది ఆ క్షణానికి మనకి చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే ఇలా చల్లని నీరు రెగ్యులర్గా తాగడం వల్ల శరీరానికి హాని చేయడంతో పాటు పలు రకాల దుష్పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. చల్లని నీటి తరచూ తాగడం వల్ల గొంతులో మ్యూకస్ అనే జిగురు పదార్థం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
దీనివల్ల గొంతు, ఊపిరితిత్తులలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా తరచూ దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. అందుకే జలుబు,దగ్గు బారినపడినప్పుడు వేడి నీళ్లనే తాగమని చెబుతుంటారు. కూలింగ్ వాటర్ తరచూ తాగే అలవాటు ఉన్నవారు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాల్సి ఉంటుంది.. లేదంటే మన ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మార్చుకుని.. ఆసుపత్రుల చట్టూ తిరగాల్సి వస్తుంది.
(( దీనిపై ఓ లుక్కేయండి: ఆ వంట నూనె వాడుతున్నారా.. మీ ఆరోగ్యం డేంజర్లో పడినట్లే! ))
జీర్ణ సంబంధిత సమస్యలు..(Health Tips)
చల్లని నీరు తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇక ఆహారం తినేటప్పుడు పక్కనే కూల్ వాటర్ బాటిల్ కనిపిస్తే చాలు తాగేస్తుంటారు. అలా చేయడం ఏమాత్రం మంచిది కాదు. కూలింగ్ వాటర్ వల్ల వాత, కఫ, దోషాలు ఏర్పడి జీర్ణ ద్రవాల పనితీరు మందగిస్తుంది. చల్లని నీరు జీర్ణ ప్రక్రియను తగ్గిస్తుంది. కొన్నిసార్లు ఇది కడుపునొప్పి, విరోచనాలకు కూడా దారి తీస్తుంది. చల్లని నీటిని అధికంగా త్రాగడం వల్ల పేగు గోడలు దెబ్బతింటాయి. వాటిపై మందపాటి జిడ్డు గల పోర పేరుకుపోతుంది. మరింత అజీర్తికి దారి తీసే అవకాశం ఉంది.
గుండె సమస్యలు
చల్లటి నీరు తాగితే గుండె కొట్టుకునే వేగం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. నాడీ వ్యవస్థలో దేనికే దీనికే కీలక పాత్ర అవడం వల్ల.. చల్లని నీటిలోని తక్కువ ఉష్ణోగ్రతలు ఈ నాడి పై ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా గుండె వేగం తగ్గుతుంది. దీంతో రక్త సరఫరా సరిగా జరగదు.
మైగ్రేన్ సమస్య
చల్లని నీరు తాగడం వల్ల మైగ్రేన్ లక్షణాలు పెరుగుతాయి. మైగ్రేన్ ఎదుర్కుంటున్న వ్యక్తులు ఇటువంటి సమస్యలు ఎదుర్కునే అవకాశం చాలా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
బ్రెయిన్ సమస్యలు
చల్లని నీరు తాగితే మెదడుకు ఆక్సిజన్ రవాణాను తగ్గిస్తుంది. దీని వలన మెదడు కణాలకు హాని కలుగుతుంది. తల తిరగడం జరుగుతుంది.
పలు ఆరోగ్య సమస్యలు
చల్లని నీరు తాగడం వల్ల కొవ్వు పేరుకు పోతుంది. అంతేకాకుండా హృదయనాల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువ మొత్తంలో భోజనం చేసినప్పుడు చల్లని నీరు తాగడం వల్ల హృదయానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కూల్ వాటర్ శరీరంలో అవసరమైన పోషకాల స్థాయిని తగ్గిస్తుంది. అందువల్ల శరీరం ఇన్ఫెక్షన్లు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతుంది.
బాబోయ్ చల్లని నీరుని తరచుగా తాగడం వల్ల ఇన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చల్లటి నీటి వల్ల దంత సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఇక నుంచి మనం ఆరోగ్యం కోసం కుండలోని నీళ్లు లేదా, ఫ్రిజ్ వాటర్ తాగినప్పటికీ అవి మరీ చల్లని నీళ్లు కాకుండా, ఒక మాదిరివి తాగడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.