Virat Kohli Video Viral: ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓటమి చవిచూసిన.. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో గెలిచి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 176 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలో దిగిన ఆర్సీబీ జట్టు 4 వికెట్ల తేడాతో విక్టరీని సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లి (49 బంతుల్లో 77; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీ, చివర్లో దినేశ్ కార్తీక్ (10 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) విధ్వంసకర బ్యాటింగ్ ఆర్సీబీని విజయ తీరాలకు చేర్చింది.
రోహిత్ విషయంలో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావ్.. ఇది న్యాయమా పాండ్యా?
ఇదిలా ఉండగా కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కెమెరాలో ఒక వ్యక్తిని చూసిన విరాట్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలు అక్కడ ఏం జరిగిందంటే..
ఆరంభం సరిగా లేదు
పంజాబ్ కింగ్స్ ఓపనర్లు పవర్ ప్లే లో పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా యష్ దయాల్ కట్టుదిట్టమైన బౌలింగ్ కింగ్స్ బ్యాటర్లని కట్టడి చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే బెయిర్‌స్టో రూపంలో తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ నిలదొక్కుకునే ప్రయత్నంలో పరుగులు చేస్తూ స్కోరు బోర్డుని పరుగులు పెట్టించే పనిలో పడింది. అయితే వికెట్లు మాత్రం మూడు నాలుగు ఓవర్లకు వికెట్లు పడుతూనే ఉన్నాయి. మ్యాచ్ ఈ రకంగా సాగుతుండగా ఇన్నింగ్స్ చివరిలో ఒక ఆసక్తికర విషయం చోటు చేసుకుంది.
పడి పడి నవ్విన కోహ్లీ
స్టేడియంలోకి వచ్చే అభిమానుల్లో కొందరు తమకిష్టమైన క్రికెటర్‌పై ఉన్న ప్రేమను పలు రకాలుగా చూపిస్తుంటారు. పంజాబ్ వెర్సస్ బెంగళూరు మ్యాచ్‌లో శిఖర్ ధావన అభిమాని అచ్చం ధావన్ లా తయారయ్యి వచ్చాడు. ఎంతలా అంటే సడన్‌గా అతడిని చూస్తూ ధావన్‌ని చూసినట్ల ఉంటుంది. ఇంతలో కెమెరామెన్ ఆ వ్యక్తి వైపు ఫోకస్ చేసి.. మళ్లీ మన ధావన్‌పై మీద కెమెరా మళ్లించాడు. అచ్చం తనలానే ఉన్న సదరు ఫ్యానిని చూసి ధావన్ కూడా అవాక్కయ్యాడు.
ధావన్‌ని పోలి ఉన్న వ్యక్తిని చూసి మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ (Virat Kohli)ఇదంతా గమనించి నవ్వు ఆపుకోలేకపోయాడు. మైదానంలో ముసి ముసి నవ్వులతో తన చేతులను అడ్డుపెట్టుకొని పొట్టచెక్కలయ్యేలా నవ్వేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
Virat Kohli’s reaction on Shikhar Dhawan’s doppelganger pic.twitter.com/Em0qT56jcr
— CricShiva (@shivauppala93) March 25, 2024