Vada Pav Girl In Delhi : కుమారి ఆంటీ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో స్ట్రీట్ ఫుడ్ అమ్ముకుంటూ జీవనం సాగించే కుమారి అనే మహిళ యూట్యూబర్ల పుణ్యమా అని కుమారి ఆంటీగా అమాంతం ఫేమస్ అయ్యింది. ఇక తనకొచ్చిన నేమ్ అండ్ ఫేమ్ తో బుల్లితెరతో పాటు సినిమా ఛాన్సులతో కుమారి ఆంటీ రేంజే మారిపోయింది. ఈ విషయం కాస్త పక్కన పెడితే ఇదే తరహాలో ఢిల్లీలో మరో యువతి వైరల్ అయింది. ఫుడ్ స్టాల్ తో ఫేమస్ అయిన ఆ యువతి ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారడంతో పాటు పలు సమస్యలు కూడా ఎదుర్కుంటోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఏంటా కథ ? ఇప్పుడు చూద్దాం..
సినిమాలు ఆపేసి.. ఎన్నారైలను పెళ్లి చేసుకొని సెటిలైన హీరోయిన్లు వీళ్లే!
సోషల్ మీడియా ఫోకస్ పడింది
కుమారి ఆంటీ కోవలేనే దేశ రాజధాని ఢిల్లీలో చంద్రిక దీక్షిత్ కూడా పాపులర్ అయింది. ఢిల్లీలోని సైనిక్ బీహార్ లో రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద వడపావ్ స్టాల్ నడుపుతోంది చంద్రిక. అందంగా వుండడంతో పాటు చదువుకున్న అమ్మాయిలా కనిపించడంతో ఆమెపై సోషల్ మీడియా ఫోకస్ పడింది. అయితే సరిగ్గా ఇక్కడే కుమారి ఆంటీ తరహా సీన్ ఇక్కడ కూడా రిపీట్ అయింది.
చంద్రిక వడా పావ్ (Vada Pav Girl)
తెలంగాణ, ఏపీలో పానీ పూరి ఎంత ఫేమస్ ఓ ఢిల్లీలో వడపావు కు అంత ఫేమస్. ఒక వీధిలో వందకు పైగా పడవ పావు బండ్లు కనిపిస్తాయి. వీటన్నింటినీ దాటి చంద్రీక పడా పావో స్టాల్ ఫేమస్ అయింది. చంద్రిక వడా పావ్ ని తిన్నవారు సోషల్ మీడియాలో సూపర్ అంటూ పోస్టులు కూడా పెట్టారు. దీంతో జనాలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఫలితంగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
స్టాల్ తీసేయాలంటూ ఆర్డర్స్
చంద్రిక స్టాల్ వల్లే రోడ్డు మీద ట్రాఫిక్ ఏర్పడిందంటూ కొందరు ఆమెపై కొందరు ఫైర్ కూడా అయ్యారు. దీంతో ఢిల్లీ కార్పొరేషన్ అధికారులు దృష్టి ఆమెపై పడింది. లైసెన్స్ లేదనడంతో పాటు పలు కారణాలు చెప్పి ఆమె స్టాల్ అక్కడి నుండి తొలగించాలంటూ అధికారులు చెప్పారు. అంతేకాకుండా స్టాల్ తీయించడానికి వచ్చిన అధికారుల వద్ద ఏడుస్తూ వాళ్లను ప్రాధేయపడుతున్న చంద్రిక వీడియో అప్పట్లో వైరల్ గా మారింది.
అధికారుల క్లారిటీ
చంద్రిక వీడియో వైరల్ అయిన నేపథ్యంలో అధికారులు స్పందించారు. తనను లంచం అడిగానని చంద్రిక మీడియాకు చెప్పిందని, కానీ తాము లైసెన్స్ తీసుకొని అధికారికంగా స్టాల్ నడుపుకోవాలని మాత్రమే చెప్పినట్లు వాళ్ళు తెలిపారు.
తాజాగా చంద్రిక ఫేమస్ అయిన తర్వాత ఎంత మేలు జరిగిందో అంతే స్థాయిలో నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం తను ఇతర వ్యాపారుల నుంచి పోటీ కూడా ఎదుర్కోవాల్సి ఉండగా, ఇకపై చంద్రిక స్టాల్ ఫుడ్ ఏ మాత్రం కాస్త అటు ఇటు ఉన్నా ఈ వార్త చాలు వైరల్గా మారి తన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడంతో పాటు వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది. సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి ఈ తరహా ఘటనలు, ఓవర్నైట్ స్టార్ స్టేటస్ పొందిన వాళ్లు, అలాగే వచ్చిన గుర్తింపుని నిలుపుకోలేక కింద పడిన వాళ్లు.. ఇలాంటివి చూస్తూనే ఉంటాం.