Prabhas Spirit Movie: యానిమల్ సక్సెస్తో మంచి ఊపు మీద ఉన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మంచి ఫామ్ లో ఉన్నాడు. తన నెక్స్ట్ మూవీ పాన్ ఇండియన్ స్టార్ట్ ప్రభాస్తో చేస్తున్న సంగతి తెలిసిందే. స్పిరిట్ అనే టైటిల్ని ఈ మూవీకి ఖరారు చేయగా… డార్లింగ్ ఫాన్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో లీక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
థియేటర్లో ఫట్.. ఓటీటీలో సూపర్ హిట్.. కావాలనే ఆ మూవీని టార్గెట్ చేశారా?
క్రేజీ ప్రాజెక్ట్
పాన్ ఇండియన్ స్థాయిలో భారీ బడ్జెట్ తో టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి రోజుకో వార్త వైరల్ అవుతునే వుంది. డార్లింగ్ ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ చేయబోతున్నారంటూ ఓ వార్త, అలాగే ఈ మూవీకి ప్రభాస్ దాదాపు 150 కోట్ల పారితోషకం తీసుకోబోతున్నారని మరో వార్త, అంతేకాకుండా ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ పై రకరకాల వార్తలు వినిపించాయి. ముఖ్యంగా విలన్ పాత్రలో రౌడీ బేబీ విజయ్ దేవరకొండ నటిస్తున్నారని ఒకరంటే.. కాదు కాదు బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ నటిస్తోంది అంటూ ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది.
స్టోరీ క్యారెక్టర్స్ పై క్లారిటీ..
స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని స్వయంగా సందీప్ రెడ్డి తెలియజేశారు. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ డైరెక్టర్ స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిందని.. గతంలో ఎన్నడూ చూడని ప్రభాస్ ను ఈ మూవీలో చూడబోతున్నారని, 100% డిఫరెంట్ పాత్రల్లో ప్రభాస్ ను చూపించబోతున్నట్లు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అంతేకాకుండా ఈ మూవీలో ప్రభాస్ ఓ నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారట. అలాంటి ఆఫీసర్ జాబులో వున్న ప్రభాస్ కు తనకు దగ్గర వ్యక్తికి తప్పు జరుగుతుంది. ఆ విషయంలో పోలీస్ ఆఫీసర్ ఎలా రియాక్ట్ అయ్యాడు అనేదే కథ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ప్రభాస్ స్టార్ డమ్ తో దేశవ్యాప్తంగా ఓపెనింగ్ రోజే అంటే 150 కోట్లు వసూలు చేస్తుందని సందీప్ రెడ్డి వంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
డబుల్ రోల్ లో డార్లింగ్(Prabhas Spirit Movie)
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పాటు విలన్ పాత్రలో కూడా నటిస్తున్నట్లు టాక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సినిమాలో డ్యూయల్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడని వార్తలు అయితే ఓ రేంజ్ లో వస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు సందీప్ రెడ్డి వంగ ఇచ్చిన ఇంటర్వ్యూలో దీంట్లో ఇంట్రెస్టింగ్ విలను పాత్ర కూడా ఉంటుందని హింట్ ఇవ్వడంతో.. పలువురు కచ్చితంగా ప్రభాస్ ఏ విలన్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చ నడుస్తోంది. ఏదేమైనా సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన హైప్ తో డార్లింగ్ ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ మూవీతో ప్రభాస్ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్స్ చేస్తాడో చూడాలి..