Family Star Movie: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృనాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్. థియేటర్ లో రిలీజ్ అయిన మొదటి రోజే మిక్స్ టాక్ అందుకున్న ఈ మూవీకి రాను రాను నెగిటివిటీ ఎక్కువైంది. దీంతో ఈ చిత్రం 20 రోజులకే నెగెటివ్ టాక్ తో ఓటీటీలోకి అడుగు పెట్టింది. కానీ ఎవరు ఊహించని విధంగా ఈ మూవీ ఓటిటిలో దుమ్ములేపుతోంది.
నీ మూడ్ బాలేదు.. రూమ్ బుక్ చేస్తానన్నాడు: వరలక్ష్మి శరత్‌కుమార్
అంతేకాకుండా ఓటిటిలో నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతుంది. అదేంటి థియేటర్ లో నెగిటివ్ టాక్ ఫేస్ చేసిన ఈ చిత్రం సూపర్ హిట్ ఏంటి ? అనే కదా మీ ప్రశ్న ఆ డీటెయిల్స్ మీకోసం.. ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయిన సమయంలో కొంతమంది కావాలని ఈ మూవీపై నెగిటివ్ ప్రచారం చేశారు. దీంతో స్వయంగా దిల్ రాజు రంగంలోకి దిగి మైక్ పట్టుకొని థియేటర్స్ వద్ద ఆడియాన్స్ రెస్పాన్స్ తీసుకున్నారు.
ఓటీటీ లో దూసుకుపోతున్న మూవీ
ఫ్యామిలీ ఆడియన్స్ అంతా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినప్పటికీ థియేటర్ కి ఆడియెన్స్ ను రప్పించలేకపోయారు. దీంతో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 26న ఓటీటీలోకి అడుగుపెట్టింది.
ఎవ్వరూ ఊహించని రేంజ్ లో స్ట్రీమింగ్
థియేటర్లో ఫ్యామిలీ స్టార్ మూవీ(Family Star Movie) ఫ్లాప్ అంటూ నెగిటివ్ ప్రచారం వచ్చింది. కట్ చేస్తే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో దుమ్ము లేపుతుంది. అంతేకాకుండా ఈ వారం ఇండియాలో టాప్ -1 సినిమాగా ఫ్యామిలీ స్టార్ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.
విజయ్ పై కక్ష
టైం బాగా లేకపోతే తాడే పామై కరుస్తుంది అన్నట్లుంది విజయ్ దేవరకొండ పరిస్థితి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విజయ్ కు మొదటి నుండి నెగిటివిటీ ఉంది. లైగర్ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండపై మరింత ట్రోలింగ్స్ పెరిగాయి. సాధారణంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాకు థియేటర్లో ఆదరణ తక్కువగా లభిస్తుంది. దానికి తోడు విజయ్ సినిమాకు మరింత నెగెటివిటీ యాడ్ అయింది. విజయ్ ఏం మాట్లాడినా కూడా తీవ్రమైన నెగిటివిటీని క్రియేట్ చేసేవారు కొందరు. ఇదంతా చేసింది ఎవరూ అంటే వేరే హీరో అభిమానులుగా టాక్ వినిపిస్తుంది.
థియేటర్లో చూడనందుకు ఫీలవుతున్నాము
ఫ్యామిలీ స్టార్ మూవీని ఓటిటిలో చూసిన కొందరు నెట్టిజనులు.. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నామని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ లు చేస్తున్నారు. రిలీజ్ టైం లో సినిమా మీద వచ్చిన నెగటివ్ ప్రచారం నిజం అనుకొని థియేటర్లో చూడలేదని.. ఇప్పుడు ఓటిటిలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నామంటూ ట్వీట్ చేస్తున్నారు.
థియేటర్ లో ఈ మూవీ చూడనందుకు ఎంతో ఫీలవుతున్నామంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాడు. విజయ్, మృణల్ పెర్ఫార్మెన్స్ కూడా సూపర్ అని మెచ్చుకున్నారు. ఓటీటీలో ఫ్యామిలీ స్టార్ టాప్ ప్లేస్ లో దూసుకుపోవడంతో నెగిటివ్ ప్రచారం అంతా అబద్ధమని.. కావాలని చేశారని ప్రూవ్ అయిందంటూ చాలమంది అభిమానులు, నెట్టిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.