Varalakshmi Sarathkumar: సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా కుదిపేస్తున్న అంశం క్యాస్టింగ్ కౌచ్. ప్రెసెంట్ స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న వారు చాలామంది కెరియర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళే. సినిమా అవకాశాల పేరిట మహిళలను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఎందరో హీరోయిన్స్ తమకు ఎదురైనా చేదు అనుభవాలను పంచుకున్నారు కూడా.
తాజాగా మరో నటి గతంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉన్న తనను రూమ్ బుక్ చేస్తానంటూ ఓ పెద్ద ఛానల్ ఓనర్ అడిగాడట. ఇంతకీ ఎవరా స్టార్ హీరోయిన్? కేసు పెట్టించిన ఆ హిరోయిన్ ఎవరు? తనకి ఎదురైన అనుభవం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం…
అసలేం జరిగింది.. ప్రియదర్శికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్!
వర్సటైల్ నటిగా తెలుగు, తమిళ భాషల్లో పేరు తెచ్చుకున్న హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్. నటుడు శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి హీరోయిన్ గా, లేడీ విలన్ గా పలు సినిమాల్లో నటించి తనదైన మార్కును చూపించి స్టార్ యాక్టర్ గా మారిపోయారు. తాజాగా వరలక్ష్మీ నటించిన చిత్రం శబరి. ఈ మూవీ మే-3న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్ లో పాల్గొంటుంది వరలక్ష్మి. స్టార్ హీరో కూతురు అయినా కూడా తాను కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానంటూ తెలిపింది.
ముందుగానే తండ్రి హెచ్చరిక
శబరి చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాకు సినీ కెరియర్ ఏమి సాఫీగా సాగలేదు. నాన్నకు ఇష్టం లేకపోయినా పరిశ్రమకు రావాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టమని తన తండ్రి ముందుగానే హెచ్చరించినట్లు ఆమె పేర్కొంది. మొదట్లో స్ట్రగుల్స్, అవమానాలు ఎదుర్కొని తనకు తానుగా మంచి పేరు తెచ్చుకున్నట్లు వెల్లడించింది.
రూమ్ బుక్ చేస్తానన్నాడు..
తమిళనాడుకు చెందిన ఓ టీవీ ఛానల్ యజమాని తన దగ్గరకు వచ్చాడని.. ఓ ప్రాజెక్టు ఉందని కలిసి పనిచేయడానికి కోరాడు. అందుకు నేను ఓకే చెప్పాను. కొంచెం సేపు గడిచిన తర్వాత మనం బయట కలుద్దాం అన్నాడు. నేను ఎందుకని అడిగాను. అలా మాట్లాడుకుందాం మీ మూడేమి బాగాలేదు కదా. రూమ్ బుక్ చేస్తా ఎంజాయ్ చేద్దాం అన్నాడు. ఆ సమయంలో నాకు ఎక్కడలేని కోపం వచ్చింది. నా ఇంటికి వచ్చి నాతోనే ఇలా మాట్లాడుతున్నావు ఎంత ధైర్యం అని అరించాను. ఒక హీరో కూతురు అయిన నన్నే ఇలా అడిగితే.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని అమ్మాయిల పరిస్థితి ఏంటి? అని అనిపించి వెంటనే అతనిపై కేసు పెట్టాను అంటూ వరలక్ష్మి (Varalakshmi Sarathkumar)తెలిపింది.
స్టార్ స్టేటస్ ఈజీగా రాలేదు
స్టార్ హీరో కూతురుగా ఉన్నాను. కానీ నా సినీ కెరియర్ లో చాలా అవమానాలు పడ్డాను. నా గొంతు మేల్ వాయిస్ లా వుంది అని హేళన చేశారు. ఆ కసితోనే నా మూవీస్ కి నేనే డబ్బింగ్ చెప్ప్పుకునేదాని. ఇప్పుడు నాకు, నా గొంతుకు ఏంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకునాను.
ఛాన్సులు కోసం కమిట్మెంట్
అవకాశాల కోసం ఎందరో కమిట్మెంట్ అడిగారని.. కొన్ని అవకాశాలు వదులుకున్నానని, కొన్నింటిని తనను వారే తీసేసారని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఎన్నో తిరస్కరణలు ఎదుర్కున్న వరలక్ష్మి శరత్ కుమార్ కెరియర్ పరంగా మంచి బిజీగా వున్నారు. ఇక ఇప్పటికే తనకున్న స్టార్ స్టేటస్ “శబరి” మూవీతో ఎలాంటి టర్న్ తిరుగుతుందో చూడాలి మరి..