Aadhaar Card New Rules: ఆధార్ కార్డ్.. ప్రస్తుతం భారతీయులు కలిగి ఉన్న గుర్తింపు కార్డులో ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు సంబంధిత వివరాలలో వంటి కీలకమైన వాటిలో ఇది తప్పనిసరిగా మారింది. అందుకే ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు వీటి సేవలను మెరుగుపరుస్తూ, సరికొత్త నిబంధనలను తీసుకొస్తుంటుంది. తాజాగా ఆధార్ అప్డేట్, ఎన్రోల్మెంట్ కు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.
దీన్ని ఆధార్ (నమోదు, నవీకరణ) సవరణ నిబంధనలు, 2024గా పేర్కొంది. ఈ నిబంధన ద్వారా దేశ పౌరులు, ప్రవాస భారతీయులకు ఆధార్ నమోదు, అప్డేట్ ప్రక్రియ మరింత సులువుగా మారనుందనే చెప్పాలి. తాజాగా యూఐడీఏఐ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఆధార్‌ను ఇకపై కార్డదారులు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్లైన్లోనూ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. వీటితో పాటు అప్డేట్ చేసుకోవడానికి రెండు కొత్త ఫారంలను తీసుకొచ్చింది. మరింత మెరుగైన సేవల అందించే క్రమంలో దేశ పౌరులు, ఎన్నారైలకు వేర్వేరు ఫారమ్‌లను జారీ చేసింది.
సులువుగా అప్డేట్
యూఐడీఏఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. కార్డుదారులు సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ (CIDR)లో తమ సమాచారాన్ని సులభంగా అప్డేట్ చేసుకోనే వెసలు బాటు ఉంది. అంతేకాకుండా ఈ అప్డేట్ అనేది నమోదు కేంద్రం, వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా చేసుకునేందుకు తాజాగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. అంతకుముందు 2016 నియమాలు ఆన్లైన్ ఫారమ్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రజలు వారి డాక్యుమెంట్లు లేదా సమాచారాన్ని అప్డేట్ చేసే వీలులేదు. ఇతర వివరాలను అప్డేట్ చేయడానికి, ఆధార్ నంబర్ హోల్డర్ ఎన్రోల్మెంట్ కేంద్రాన్ని తప్పక సందర్శించాల్సి ఉంటుంది.
ఫారం 1: ఆధార్ నమోదు, నవీకరణ. 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా, నివాసితులు లేదా నాన్-రెసిడెంట్ భారతీయులు (NRI) ఆధార్ నంబర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఫారమ్‌ను ఉపయోగించవచ్చు. దరఖాస్తుదారులు భారతీయ చిరునామా రుజువును కలిగి ఉండాలి. ఇదే ఫారమ్‌ను ఆధార్‌లోని వివరాలను అప్డేట్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.
ఫారం 2: ఎన్నారై (NRI)ల కోసం
ఇతర దేశాలలో ఉంటున్న ఎన్నారై (NRI)లు ఈ ఫారమ్‌ను ఉపయోగించవచ్చు. వారు నమోదు చేసుకోవడంతో పాటు వారి వివరాలను అప్డేట్ చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు.
ఫారం 3: దేశంలో అడ్రస్ కలిగి ఉన్న ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లల ఈ ఫారం ఉపయోగపడుతుంది.
ఫారం 4: 5 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న ఎన్నారై పిల్లల కోసం ఈ ఫారం పని చేస్తుంది
ఫారం 5: భారతీయ చిరునామా ఉండి, 5 సంవత్సరాల లోపు పిల్లలు
ఫారం 6: 5 సంవత్సరాల లోపు ఎన్నారై పిల్లలు
ఫారం 7: భారతదేశంలో నివాస ఉంటున్న విదేశీ పౌరుల కోసం. వారి ఆధార్ కార్డును ఎన్రోల్, అప్డేట్ చేయడానికి వారు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. వారు విదేశీ పాస్‌పోర్ట్, OCI కార్డ్, చెల్లుబాటు అయ్యే దీర్ఘకాల భారతీయ వీసా, ఇమెయిల్ ఐడీని కలిగి ఉండాలి.
ఫారం 8: భారత్‌లో నివాసం ఉండే విదేశీ పిల్లల కోసం. అయితే వారి వయసు 18 ఏళ్లలోపు ఉండాలి
ఫారం 9: ఆధార్ నంబర్ రద్దు చేయడం కోసం
వయసు రుజువు తప్పనిసరి
ముఖ్యంగా కార్డుదారులు వారి వయసు రుజువు కోసం డాక్యుమెంటరీ ఫ్రూఫ్ కచ్చితంగా ఉండాలి. దీని ఆధారంగానే కార్డ్‌పై పుట్టిన తేదీని నమోదు చేస్తారు. డాక్యుమెంట్ పరిశీలన లేదా కార్డుదారుని కుటుంబ పెద్ద నిర్ధారణ ఆధారంగా ఎన్రోల్మెంట్ లేదా వివరాలు అప్డేట్ చేయవచ్చు.
మరోవైపు, ఎన్నారైలు తప్పనిసరిగా ఆధార్‌లో ఇమెయిల్ ఐడిని అందించాలి. ఒకవేళ, ఎన్నారైలు భారతీయేతర మొబైల్ నంబర్‌ను అందిస్తే, ఆ నంబర్‌కు ఎస్ఎంఎస్ సేవలు పనిచేయవు,కనుక భారతీయ మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రూల్ ఫారమ్ 1 మార్గదర్శకాలలో వివరించి ఉంటుంది.