Best Movies Ott Telugu: సమ్మర్ మొదలైంది.. పొద్దున పది అయితే బయట అడుగుపెట్టలేం.. ప్రస్తుతం పిల్లలకి స్కూల్స్ సెలవు. ఇంకేముంది దాదాపు ఇంట్లోనే కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. ఇక ఓటీటీ సంస్థలు కూడా ఈ సీజన్లో మంచి సినిమాలతో తమ ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. అందుకే కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమాలను తమ ప్రేక్షకులకు అందిస్తున్నాయి.
Urvashi Rautela: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ.. దేవర సినిమాలో ప్రత్యేక పాత్ర?
ఈ క్రమంలోనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో రెండు చిత్రాలు ఓటీటీలో రచ్చ చేస్తున్నాయి. చిన్న సినిమాలుగా థియేటర్ లో రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయ్యి ప్రస్తుతం ఓటీటీలోనూ అదే హవా కొనసాగిస్తున్నాయి. ఇంతకీ ఏంటా మూవీస్ ? ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయని చూద్దాం..
కొత్త కాన్సెప్ట్..
విశ్వక్సేన్ హీరోగా నటించిన ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘గామి’.ఇందులో చాందిని చౌదరి, అభినయ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మార్చి 8న విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను తెచ్చుకుంది. తొలిసారి కెరీర్లో విభిన్న పాత్ర ఎంచుకున్న విశ్వక్.. అఘోర పాత్రలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. దాదాపు ఆరేళ్ల పాటు షూటింగ్ చేసి మరి ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. డిఫరెంట్ స్టోరీస్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ‘గామి’ మూవీ తప్పకుండా నచ్చుతుందనే చెప్పొచ్చు.
ఇక ఈ మూవీ Zee5 ఓటీటీ వేదికగా ఏప్రిల్ 12 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. తెలుగుతోపాటు తమిళం, కనడంలోనూ ఇది ప్రసారం అవుతోంది. ఈ మూవీ ఓటీటీలో విడుదలైన నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. గామి మూవీ అలా స్ట్రీమింగ్ మొదలైందో లేదో.. 72 గంటల్లోనే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్‌ను సొంతం చేసుకుని అందరినీ ఆశ్యర్యపరిచింది. అంతేకాకుండా తక్కువ సమయంలో ఎక్కువ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్‌ను దక్కించుకున్న చిత్రంగా నిలిచింది.
నో లాజిక్.. ఓన్లీ కామెడీ….. (Best Movies Ott Telugu)
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ‘ఓం భీమ్ బుష్’ మూవీ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ ఆరంభంలోనే ఓ రేంజ్ లో హైప్ ను క్రియేట్ చేసుకుంది. మార్చి 22న థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీలో లాజిక్‌లు లేకపోయినా… కామెడీకి కనెక్ట్ అయిన ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. దీంతో ఈ మూవీకి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓ రేంజ్ లో డిమాండ్ ఏర్పడింది.
ఎట్టకేలకు ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ మూవీ కూడా ఏప్రిల్ 12 నుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రాగా… అటు ధియేటర్తో పాటు ఇటు ఓటీటీలోనూ ప్రేక్షకులను నవ్విస్తోంది ఓం భీమ్ బుష్. ఎంటర్టైన్మెంట్ కోసం చూసే ప్రేక్షకులకు ఈ రెండు మూవీస్ ది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు..