Better Sleep At Night: పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అనేవాళ్లు. అలాంటి ఆరోగ్యంగా పొందాలంటే మంచి ఆహారం ఎంత ముఖ్యమో మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. ప్రస్తుత రోజుల్లో ఫుడ్ అంటే ఒక చోటు కాకపోయినా మరోచోట, కాస్త ఎక్కవ పైసలు ఖర్చు పెట్టి క్వాలిటీ ఆహారం దొరుకుతుంది. అయితే నిద్ర అలా కాదు.. ఇటీవల చాలా మంది రాత్రి వేళ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
కూల్ వాటర్ తెగ తాగుతున్నారా? వామ్మో ఇన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాలా!
రాత్రిపూట తక్కువ నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యలు అన్ని ఇన్ని కావు. ఒక్కోసారి ఈ సమస్య అనారోగ్యానికి ముప్పుగా మారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్ర లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి? మంచి నిద్ర కోసం ఏం చేయాలి? పలు విషయాలు తెలుసుకుందాం..
ఎన్ని గంటలు నిద్రపోవాలి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సూచన ప్రకారం ప్రతి ఒక్కరూ రోజుకి 8 గంటల నిద్రపోవాలి. కానీ ఎనిమిది గంటలకంటే తక్కువ నిద్రించే వారిలో అలసట, నీరసం, బద్ధకంతో పాటు మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
నిద్రలేమితో దుష్ఫలితాలు
సరైన నిద్ర లేని ప్రతి ఒక్కరూ ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.
(1) డిప్రెషన్, రోగనిరోధక వ్యవస్థ సమస్యలతో పాటు శారీరక-మానసిక సమస్యలు తలెత్తుతాయి.
(2) అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, కార్డియాక్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. (Better Sleep At Night)
(3) నైట్ షిఫ్ట్స్ పనిచేసే కొందరి ఉద్యోగుల్లో ఉబకాయం, డయాబెటిస్ వంటి సమస్యలు సైతం ఏర్పడడం మనం గమనించవచ్చు.
ఏ వయసు వారికి ఎంత నిద్ర?
అతి అనర్ధదాయకం అన్నట్లు ఒక్కో వయసు వారికి ఒక్కో నిర్ణీతమైన నిద్ర అవసరం.
(1) పెద్దవాళ్లు రోజులు కనీసం 8 గంటలైనా నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారు. అంతకంటే తక్కువ 6 గంటలకంటే తక్కువ నిద్రపోతే మంచిది కాదు.
(2)టీనేజర్లకు సుమారు తొమ్మిది నుంచి పది గంటలసేపు నిద్రపోతే మంచిది. కానీ 11 నుంచి 12 గంటల వరకు నిద్ర అసలు మంచిది కాదు.
(3) అప్పుడే పుట్టిన పిల్లలు కనీసం 18 గంటలు నిద్రపోవాలి. వారితో ఆడుకుందాం కదా అని నిద్ర లేపకూడదు.
(4) చిన్నపిల్లలయితే కనీసం 11 గంటలు నిద్రపోవాలి. కాబట్టి వారికి ఫోన్లు, టీవీలు అలవాటు చేయడం మంచిది కాదు.
(5) అతిగా నిద్రపోతే మెదడులో మరో రకమైన సమస్య ఏర్పడుతుంది. జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం సైతం ఉంది.
మంచి నిద్ర కోసం ఇవి తప్పనిసరి
(1) ఆరోగ్యకరమైన జీవితం కావాలి అంటే ముఖ్యమైన విషయం ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం.
(2) బెడ్ రూమ్ ని చీకటిగా ఉంచుకోవడంతో పాటు, మొబైల్ ఫోన్స్ ను దూరంగా ఉంచడం మంచిది.
(3) రాత్రి వేళల్లో టీ, కాఫీ వంటివి తాగడం మానుకోవాలి.
(4) విటమిన్ డి లోపం ఉన్న త్వరగా నిద్ర పట్టదు. కాబట్టి ప్రతిరోజు ఉదయం కాసేపు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
(5) అర్ధరాత్రి టీవీ చూడడం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం, ఫోన్ వాడకం వంటివి మానుకోవాలి.
చక్కగా ఆరోగ్యంగా నిద్రపోగలిగితే అసాధారణంగా ఆ మనిషి ఆయుషు కంటే ఐదు సంవత్సరాలు ఎక్కువ బతుకుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మన జీవనశైలిలో ఇకపై ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుని.. చక్కని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుదాం…