Bigboss Fame Shanmukh Jaswanth Video Goes Viral: తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ యూట్యూబర్‌గా షణ్ముఖ్ జస్వంత్‌కు మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ లోకి వెళ్లి వచ్చాక ఇతని ఇమేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. యాక్టింగ్, డాన్స్ పరంగా షన్ను ఎంత పేరు సంపాదించుకున్నాడో.. వివాదాల పరంగా కూడా అదే స్థాయిలో వార్తల్లో నిలుస్తున్నాడు.
ఇటీవల షన్ను గంజాయి కేసులో దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ యూట్యూబర్‌పై రోజూ పలు కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా షణ్ముఖ్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అందులో ఏముందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..
(( దీనిపై ఓ లుక్కేయండి:: ప్రభాస్ డూప్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎంతో తెలుసా? ))
బయటకొచ్చిన వీడియో
అసలేం జరిగిందంటే.. షణ్ముక్ అన్నయ్య సంపత్ తనని మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ యువతితో పాటు వారి ఫ్లాట్‌కు వెళ్లింది. అయితే అక్కడ అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి. షణ్ముక్ అన్నయ్య కోసం వెళ్లిన పోలీసులకు .. ఆ ప్లాట్‌లో షణ్ముక్ గంజాయితో పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు షన్ను గంజాయి సేవిస్తూ ఉన్నాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త సంచలనంగా మారింది.
మీడియాలో ఈ ఘటనపై పలు రకాల కథనాలు వెలువడ్డాయి. తప్పు ఒప్పులు పక్కన పెడితే. షన్ను ఎన్నో సంవత్సరాలు, ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరు ఈ ఘటన వల్ల డ్యామేజ్ అయ్యేలా ఉంది. మరోవైపు షన్నుకు సంబంధించిన ఒకటి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో అతను.. ఎదురుగా ఉన్న వాళ్లతో చూడండి.. మీరే చూడండి. నేను చాలా రోజులుగా డిప్రెషన్లో ఉన్నానని చెబుతున్నారు. అంతేకాకుండా తను సూసైడ్ కూడా చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పాడు. దీని బట్టి చూస్తే అతను ప్రస్తుతం డిప్రెషన్లో ఉన్నట్లు తెలుస్తుంది.
అదేనా కారణం
తన కంటెంట్‌లో ఎక్కువగా విద్యార్థులు, మధ్యతరగతి వర్గాలకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దీంతో యూత్‌లో ప్రత్యేకించి యూట్యూబ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న షన్ను(Shanmukh Jaswanth) ఇప్పుడు డిప్రెషన్‌కు చేరుకునే స్థాయికి ఎందకు చేరుకున్నాడో పూర్తి వివరాలు ఎవరికి తెలియదు. కొందరేమో షన్ను వ్యక్తిగత జీవితంలో ప్రేమ అనే అధ్యాయం వల్లే ఈ రకంగా డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవమనేది తెలియాల్సి ఉంది.ఇక ఈ వీడియో చూసిన వాళ్లు మిశ్రమంగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు షన్నుకి మద్దతుగా నిలవగా మరికొందరు మాత్రం అతను చేసింది తప్పని కామెంట్ చేస్తున్నారు.