Fighter Movie: హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా నటించిన సినిమా ఫైటర్. ఇటీవల విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుని కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక్కడ వరకు అంతా బాగుంది కానీ ప్రస్తుతం ఈ మూవీ వివాదాస్పదమైంది. ఈ చిత్రంపై ఐఏఎఫ్ అధికారి సౌమ్యదీప్ దాస్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఫైటర్ సినిమాపై లీగల్ టీంకు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే దీనిపై తాజాగా దర్శకుడు ఆనంద్ సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చాడు. అసలు ఈ సినిమా వివాదాస్పదంగా మారడానికి కారణమేంటి..
అంతా ఓకే గానీ ఆ సీన్లు..
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆనంద్ సిద్ధార్థ్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ఫైటర్(Fighter Movie). ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులను బేస్ చేసుకుని తొలి ఏరియల్ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ మూవీ.. ప్రస్తుతం న్యాయపరమైన చిక్కుల్లో పడింది. ప్రధానంగా హృతిక్, దీపికాల మధ్య లిప్‌లాక్ సన్నివేశాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి లీగల్ యాక్షన్‌కు దిగింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి లీగల్ నోటీసులు సైతం అందాయి. లిప్ లాక్ సీన్ల పై అస్సాంకు చెందిన ఎయిర్ ఫోర్స్ అధికారి సౌమ్యదీప్ దాస్ సీరియస్ అయ్యారు.
((దీనిపై ఓ లుక్కేయండి: నిర్మాతలకు ఇలానే చెబుతా.. రెమ్యునరేషన్ పెంపు వార్తలపై అదిరిపోయే రిప్లై!))
సైనిక దుస్తుల్లో ఉండి లిప్ లాక్ సీన్లలో నటించడం అంటే యూనిఫాంని అగౌరపరచడమే కాకుండా భారత వైమానిక చట్టాన్ని ఉల్లంఘించడమేనని సౌమ్యదాస్ తన నోటీసులో పేర్కొన్నారు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లుగా నటించిన వీరు బాధ్యతారహితమైన పలు సన్నివేశాల్లో నటించడం అధికారుల పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా భద్రతతో కూడిన రన్ వై మీద లిప్ లాక్ సీన్లు చేయడం చాలా తప్పు అంటూ నిప్పులు చెరిగారు. వీటిని చూసి భవిష్యత్తులో ఎవరైనా అలా చేస్తే దానికి బాధ్యులు ఎవరని ఆమె ప్రశ్నించారు. తాజాగా ఈ నోటీసులపై డైరెక్టర్ ఆనంద్ సిద్ధార్థ్ స్పందించాడు.
క్లారిటీ ఇచ్చిన సిద్ధార్థ్
ఫైటర్ మూవీ స్క్రిప్ట్ రాసుకున్నప్పటి దగ్గర నుండి సెన్సార్ రిపోర్ట్ వచ్చేంతవరకు ప్రతి విషయాన్ని ఎయిర్ ఫోర్స్ అధికారులతో చర్చించామంటూ ఆనంద్ సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. మూవీ రిలీజ్ కి ముందు ఎయిర్ ఫోర్స్ లోని పలు అధికారులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అత్యున్నతమైన 100 మంది ఎయిర్ ఫోర్స్ అధికారులకు సైతం ఫైటర్ మూవీని చూపించామని తెలిపాడు. మూవీ చూసిన వారు … నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సైతం ఇచ్చారని పేర్కొన్నారు.
ఎయిర్ ఫోర్స్ పై తమకు గౌరవం ఉందని నిబంధన మేరకు సినిమా తీశామని వివరించాడు. మూవీ చూసిన అధికారులు అప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేయలేదని, సర్టిఫికెట్ ఫిజికల్ కాపీ కూడా తమ దగ్గర ఉందని సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చాడు. అప్పుడు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు కావాలనే తమపై బురద చల్లుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఏదేమైనాప్పటికీ ఆనంద్ సిద్ధార్థ్ ఇచ్చిన క్లారిటీతో ఇప్పటికైనా ఈ వివాదానికి తెరపడుతుందేమో చూడాలి.