Gaami Movie:కంటెంట్ ఈజ్ కింగ్.. ప్రస్తుతం టాలీవుడ్లో వస్తున్న కొన్ని సినిమాలు చూస్తే ఈ లైన్‌కి సరిగ్గా సరిపోతాయని అనిపిస్తుంది. మూవీలు భారీ హిట్లు కావాలంటే అందులో స్టార్లు ఉండాలి, కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలి.. అంతెందుకు ఒక్కో పాటకు కోట్లతో సెట్ వేసి తెరకెక్కించాలి.. కొన్ని నిమిషాల సన్నివేశాలకు భారీ సెట్లు.. ఇక సినిమా అయ్యాక అనవసర హంగులు, ఆర్భాటాలు ఇలాంటివి చూసేవాళ్లం.
దీనిపై ఓ లుక్కేయండి:: స్టార్ హీరోయిన్ డిజాస్టర్ కెరీర్ గ్రాఫ్.. బాబోయ్ 5 ఏళ్లలో హిట్లు కంటే ఫ్లాప్లే ఎక్కువ!
హిట్ కావాలంటే కోట్లు అక్కర్లేదు కంటెంట్ ఉంటే చాలని ఇప్పటికే యూత్‌ని ఆకట్టుకున్న బేబీ మూవీ, ఇటీవల రిలీజైన హనుమాన్, కార్తికేయ సినిమాలు నిరూపించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రైలర్‌తో అందరినీ తన వైపు తిప్పుకున్న విశ్వక్సేన్ గామి కూడా ఇదే తరహాలో ఉన్నట్లు కనిపిస్తుంది.
చిన్న సినిమా చూసి షాక్ అయ్యారు!
పేరుకి గామి చిన్న సినిమా.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ మూవీకి డబ్బులు సమకూర్చుకున్నారు. ఇక దాదాపు ఆరేళ్ల పాటు ఎంతో శ్రమంచి, ఎన్నో కష్టాలను ఓర్చి తెరకెక్కించారు. ఇక గామి ట్రైలర్ రిలీజ్ కాగానే అందరినీ ఆకట్టుకోవడంతో, ఆశ్చర్యపరిచింది కూడా. ఒక చిన్న సినిమా, ఏ అంచనాలు లేవు, పెద్ద స్టారు క్యాస్ట్ లేదు, బడ్జెట్ కూడా లేకపోయినా ఇంత కొత్తదనమా.. అని షాకై చూస్తున్నారు. ఈ తరహా ఔట్పుట్ రావాలంటే ఖచ్చితంగా వందల కోట్లు కుమ్మరించాల్సిందేనని గతంలో భావించేవారు.
అయితే అంత అక్కర్లేదని గామి చూస్తేనే అర్థం అవుతుంది. ఇక ప్రత్యేకంగా ఈ ట్రైలర్‌ని చూస్తే.. ఒక ఎపిక్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ చిత్ర యూనిట్ తపన కనిపిస్తుంది. ఇక ఈ సినిమా హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తే చాలు.. దీని ప్రభావం రాబోయే సినిమాలపై పడే అవకాశం ఉంది. మేకర్స్ కోట్లు మీద కాకుండా కంటెంట్ మీద దృష్టి పెడతారని అనిపిస్తుంది. భవిష్యత్తులో చిన్న బడ్జెట్‌తో కొత్తదనంతో కూడిన కథలు, వాటితో అద్భుతాలు చేయాలంటే యంగ్ టాలెంట్‌కి కాస్త ప్రోత్సాహం అందిస్తే సరిపోతుందని సినీ పండితులు చెబుతున్నారు.
ఆరేళ్ల కష్టం ఇది!
ఇక గామి కోసం ఈ చిత్ర యూనిట్ ఆరేళ్లు ఎంత కష్టపడి తెరకెక్కించింది. హిమాలయాల్లో గడ్డ కట్టే చలిలోనూ షూటింగ్ చేయడం, అంతేకాకుండా కొన్ని సీన్లు రియల్ లొకేషన్లోనే షూటింగ్ చేసినట్లు ఇటీవల విశ్వక్ సేన్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా గామి కోసం విశ్వక్ ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదట. ఈ చిత్రం కోసం తాను ఎంతో కష్టపడ్డానని తెలిపిన విశ్వక్సేన్… ఆరేళ్ల క్రితం సెట్స్‌లోకి ఎలా వెళ్లే వాడో.. ఆరు నెలల ముందు జరిగిన షూటింగ్‌లోనూ అలానే వెళ్లానంటూ చెప్పుకొచ్చాడు.
ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న గామి థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తుంటే చిత్ర యూనిట్ కష్టం కళ్ల ముందే కనిపిస్తోంది. ట్రైలర్ అదిరిపోవడంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ భారీగానే పెరిగాయి. ఇక నెట్టింట అయితే… కొందరు నెటిజన్లు హాలీవుడ్ మూవీని చూస్తున్న ఫీలింగ్ కలిగిందని ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా గామి విడుదల అయ్యాక.. దీని ఫలితం తేలనుంది.
త్వరలో విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఆ చిత్రం షూటింగ్ కాస్త బ్యాలెన్స్ ఉండిపోయిందని, అది పూర్తి కాగానే విడుదల తేదీ ప్రకటించనున్నారు. అయితే పలు కారణాల వల్ల గత ఏడాదే విడుదల కావాల్సిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆలస్యం అవుతున్న సంగతి తెలిసిందే.