Hanuman Movie: యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘హనుమాన్’. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ రికార్డులు సృష్టిస్తూ కలెక్షన్లను కొల్లగొడుతోంది. చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రం పై ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల ఈ మూవీపై ఓ స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ డైరెక్టర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఆ కథేంటంటే..
హనుమాన్ కంటే ఆ మూవీ బాగుంది..
విపరీతమైన పోటీ ఉండికూడా కేవలం కంటెంట్‌ని నమ్ముకుని సంక్రాంతి బరిలోకి దిగిన మూవీ హనుమాన్(Hanuman Movie). డైరెక్టర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరి నోట సూపర్, వావ్ అనిపించుకుంది ఈ చిత్రం. మౌత్ టాక్‌తో చెలరేగిపోయిన హనుమాన్ దాదాపుగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది. తక్కువ బడ్జెట్ తోనే రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇదిలా ఉండగా తాజాగా ‘హనుమాన్’ మూవీ పై ఓ నెటిజన్ భిన్నంగా స్పందించాడు. సదరు నెటిజన్ పెట్టిన ట్వీట్లో.. నాకెందుకో హనుమాన్ కంటే శ్రీ ఆంజనేయం మూవీనే నచ్చింది. సూపర్ హిట్ సినిమా శ్రీ ఆంజనేయం. ఈ విషయం ప్రేక్షకులకు అర్థం కావడం లేదంటూ తన పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్‌పై ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ స్పందించాడు.
((దీనిపై ఓ లుక్కేయండి: కొత్త లుక్‌లో ప్రిన్స్.. పూనకాలు గ్యారెంటీ అంటున్న ఫ్యాన్స్!))
కృష్ణవంశీ స్పందన..
ప్రేక్షకులు ఎప్పుడూ తప్పు చేయరు. వాళ్లకు నచ్చలేదు అంటే ఏదో తప్పు జరిగి ఉంటుంది లేదా మూవీ రీచ్ అవడంలో సమస్య ఉండి వుండవచ్చు. నేను కూడా కొన్ని సన్నివేశాల్లో తప్పు చేసి ఉంటాను అందుకే ఆ మూవీ హిట్ కాలేదేమో అంటూ ఎంతో హుందాగా స్పందించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది.
రెండు స్టోరీలు ఒకటే.. బట్
గతంలో కృష్ణవంశీ తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం మూవీని హనుమాన్ మూవీతో పోలుస్తూ.. చాలామంది ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. హనుమంతుడి వల్ల ఓ సామాన్య యువకుడికి అద్భుత శక్తులు వస్తే..వాటితో అతను ప్రజలను ఎలా రక్షిస్తాడు అనేది హనుమాన్ మూవీ కథ. ఇదే తరహాలో శ్రీ ఆంజనేయం స్టోరీ కూడా ఉంటుంది. 2004లో విడుదలైన ఈ సినిమాలో నితిన్ హీరోగా, అర్జున్ ఆంజనేయ స్వామిగా నటించారు. కమర్షియల్ గా ఫ్లాప్ అయినప్పటికీ కథ, స్క్రీన్ ప్లే మాత్రం అద్భుతంగా తెరకెక్కించాడు కృష్ణవంశీ.
అదే మైనస్..
శ్రీ ఆంజనేయం సినిమాలో ఛార్మి క్యారెక్టర్ చాలా చిరాకు పుట్టించిందని, మితిమీరిన ఎక్స్పోజింగ్ సాంగ్ డ్రా బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు హీరోయిన్ క్యారెక్టర్ లేకపోయి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది అంటూ అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా హనుమాన్ సక్సెస్ తరువాత మరోసారి శ్రీ ఆంజనేయం ప్రస్తావన రావడం విశేషం.