Hanuman: టాలీవుడ్లో సంక్రాంతి అనగానే సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. అందులో ఈ సారి ఆ సందడి కాస్త విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రాలకు థియేటర్ల సర్దుబాటు కాక చివరికి వివాదంగా మారింది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కేవలం కంటెంట్‌ని నమ్ముకుని పెద్ద సినిమాలతో పోటీగా బరిలోకి దిగిందిప్రశాంత్ వర్మ తెరకెక్కించిన “హనుమాన్ మూవీ.
తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా మౌత్ టాక్‌తో బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతూ కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ పెద్ద సినిమా రికార్డులను చెరిపేస్తూ సరికొత్త చరిత్రను సృష్టించింది. తాజాగా టాలీవుడ్ చరిత్రలోనే టాప్ స్టార్ హీరోల మూవీస్ రేంజ్లో ఓ ప్రత్యేక రికార్డ్‌ను క్రియేట్ చేసింది.
(( దీనిపై ఓ లుక్కేయండి: అందాలతో పిచ్చేక్కిస్తున్న బ్యూటీ .. అవార్డ్ ఫంక్షన్లో అందరి చూపు అటే! ))
చిన్న సినిమా.. పెద్ద రికార్డ్
సంక్రాంతి అంటేనే తెలుగు వాళ్లకు గుర్తొచ్చేది పల్లెటూర్లు, కొత్త అల్లుళ్లు, కోడిపందాలతో పాటు సినిమాలు కూడా. అందుకే ఈ పండుగకి తమ తమ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటూ.. నిర్మాతలు, దర్శకులు, టాప్ హీరోలు సైతం తెగ పోటీ పడుతుంటారు. మామూలు రోజుల్లో సినిమా హిట్ అవ్వడం కంటే కూడా సంక్రాంతికి హిట్ అయితే ఆ కిక్కే వేరు అంటూ..అందరూ ఆ పండుగ మీదే దృష్టి పెడతారు.
ఈ నేపథ్యంలోనే ఈ సారి సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవ్వాలని ప్రయత్నించి.. చివరికి నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. ఎన్నడు లేని విధంగా టాప్ హీరోలు మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, పెద్ద స్టార్లు ఒకేసారి బరిలోకి దిగారు. వీళ్ల మధ్యలో ‘హనుమాన్’ చిత్రంతో(Hanuman) తేజ సజ్జ ముందుకు వచ్చాడు. చిన్న సినిమా అని వెనక్కి తగ్గమని చెప్పినా వినకుండా మా కథపై మాకు నమ్మకం ఉంది తగ్గేదేలే అంటూ సంక్రాంతి బరిలోకి దిగాడీ ఈ బుడ్డోడు.
చిన్న మూవీ, పైగా ఈ మూవీలో పెద్దగా తారాగణం, భారీ బడ్జెట్ కూడా లేదు, ట్రైలర్‌తో వచ్చిన హైప్ తప్ప, దర్శకుడు ప్రశాంత్, తేజకు ఈ సినిమాపై నమ్మకం తప్ప..ఇందులో ఇంకేం లేదు అనుకున్నారు కొందరు. ప్రీమియర్ షోలు పడడంతో మొదలైన దూకుడు మళ్లి ఆగలేదు. థియేటర్లో హిట్ కలెక్షన్లు వస్తాయి అని అన్న వాళ్లకు సైతం ఊహించని విధంగా షాక్ ఇచ్చిందీ సినిమా. బ్లాక్‌బస్టర్ కాదు డబుల్ బ్లాక్ బస్టర్ స్టేటస్‌ని అందుకుని సంక్రాంతిలో వినోదానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది హనుమాన్.
ఆ రికార్డును సైతం చెరిపేసిన హనుమాన్
దర్శకుడు ప్రశాంత్ వర్మ తేజ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీలో పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ అవ్వగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మూడేళ్ల క్రిందట సంక్రాంతి బిగ్గెస్ట్ గ్రాస్ గా నిలిచిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “అలవైకుంఠపురంలో” మూవీ రికార్డును సైతం హనుమాన్ బద్దలు కొట్టింది. అంతేకాకుండా దశాబ్దాల సంక్రాంతి సినిమాల చరిత్రలో.. స్టార్ హీరోలు నటించిన పెద్ద సినిమాల పేరిట ఉన్న అన్ని రికార్డులను చెరిపేసి హనుమాన్ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదిలా ఉండగా ఫుల్ రన్లో ఈ మూవీ మరో రూ.100 కోట్లకు వరకు గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.