Heinrich Klaasen.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థులు వణికిపోతున్నారు. ప్రత్యర్థి జట్లను కసిగా బాదడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో వారికి బంతులు ఎక్కడ వేయాలో అర్థంగాక బౌలర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు బౌలింగ్‌లో బలంగా కనిపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 17వ సీజన్లో మాత్రం గేర్ మార్చింది. ఈ సీజన్లో ఏ జట్టుకు లేని లైనప్‌తో మన బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఇక టోర్నీలో హెన్రిచ్ క్లాసెన్ రైజర్స్‌కు ట్రంప్ కార్డులా మారాడు. బౌండరీలు వద్దు.. సిక్సర్లే ముద్దు అంటున్న క్లాసెన్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.
మంచి నీళ్లు తాగినంత తేలిగ్గా క్లాసేన్ సిక్సులు కొట్టగలడు. ఒక్కసారిగా గేర్ మార్చి.. క్షణాల్లో పరిస్థితులను మార్చేయడంలో అతడు సిద్ధహస్తుడు. నెట్స్‌లో సిక్సులు బాదడాన్ని ప్రాక్టీస్ చేసే క్లాసేన్.. మ్యాచ్‌లో అలాంటి షాట్లనే రిపీట్ చేస్తుంటాడు. అతడు ఐపీఎల్లో ఈ రేంజ్లో షాట్లు ఆడేందుకు భారత అన్క్యాప్డ్ కుర్రాళ్లు కూడా సాయం చేస్తున్నారని టాక్ వచ్చింది.
Read More: ముంబైని భయపెట్టాడు; పొట్టకూటి కోసం అంపైరింగ్.. ఎవరీ అశుతోష్ శర్మ?
వాళ్లెవరో కాదు.. సన్‌రైజర్స్ జట్టులో ఉన్న అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డిలే. భారీ సిక్సర్లు బాదడంలో ఈ ఇద్దరు దిట్ట. అభిషేక్, నితీశ్ చక్కగా హిట్టింగ్ చేస్తున్నారన్న క్లాసేన్.. నెట్స్‌లో వారు ఎలా బ్యాటింగ్ చేస్తున్నారో చూస్తానన్నాడు. వారిద్దరి నుంచి భారీ సిక్సర్లు ఎలా ఆడాలో నేర్చుకుంటున్నట్లు చెప్పాడు. నేర్చుకోవడంలో చిన్నా, పెద్ద అంటూ ఏం ఉండదు. మనకి రానిది నేర్చుకోవడంలో తప్పు లేదు.
వాస్తవానికి క్లాసేన్ సీనియర్ ఆటగాడు. సౌతాఫ్రికా తరఫున ఆడటంతోపాటు సత్తా చాటిన ప్లేయర్ అతడు. ప్రస్తుతం టీ20ల్లో ది బెస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అలాంటి ప్లేయర్ తన కంటే ఎంతో చిన్నవాళ్లయిన.. ఇంకా జాతీయ జట్టు తరఫన అరంగేట్రం కూడా చేయని ఆటగాళ్ల నుంచి నేర్చుకుంటున్నానని చెప్పడం అతని హుందాతనానికి నిదర్శనం.
పేస్‌ను సమర్థంగా ఎదుర్కొనే క్లాసెన్ స్పిన్ బౌలింగ్‌ను అంతగా ఆడలేడు. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కోసం తాను చాలా హోం వర్క్ చేస్తానని క్లాసేన్ తెలిపాడు. టీమిండియా స్పిన్నర్ చాహల్ బౌలింగ్‌ను ఎదుర్కోవడాన్ని తాను ఇష్టపడతానన్నాడు. తన చిన్నతనంలో క్రిస్ గేల్ ఆటను బాగా ఇష్టపడేవాడినని పేర్కొన్నాడు. అందుకే 45 నంబర్ జెర్సీతో మ్యాచ్‌ల్లో బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశాడు.
Read More: IPL 2024: అభిమానుల్లో ఐపీఎల్ క్రేజ్..” క్యాష్”తో పండగ చేసుకుంటున్న ఫ్రాంచైజీలు