Actress Who Married Nri Men: ఎన్నో కలలతో రంగులో ప్రపంచమైన సినీ రంగంలోకి వచ్చి స్టార్ హీరోయిన్లుగా పేరు సంపాదించుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఎన్నో కష్టాలు పడి చివరికి హీరోయిన్లుగా మెప్పించి కెరియర్ మంచి పిక్స్‌లో ఉన్న సమయంలో కొందరు, అవకాశాలు తగ్గడంతో మరికొందరు పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యారు.
రవితేజ మూవీ, సడన్‌గా అలా అన్నారు.. బాత్రూంకి వెళ్లి ఏడ్చేశాను!
అయితే వీరిలో చాలామంది ఎన్నారైలను పెళ్లి చేసుకొని దేశ విదేశాలలో సెటిల్ అయ్యారు. వివాహం అనంతరం పిల్లలు, కుటుంబ బాధ్యతలతో దాదాపు సినిమాలకు దూరమైనప్పటికీ వారిలో మరికొందరు మాత్రం మళ్లీ సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చిన వారు ఉన్నారు. ఇక ఎన్నారైలను వివాహం చేసుకొని సెటిల్ అయినా కొందరు తారలు ఎవరో చూద్దాం..
లయ (Actress Who Married Nri Men)
ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది లయ. కెరియర్ మంచి పిక్స్ లో ఉండగానే ఓ ఎన్నారై డాక్టర్ గణేష్ ని పెళ్లి చేసుకుని అమెరికాలోని కాలిఫోర్నియాలో సెటిలైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ప్రీతి జింటా
సొట్ట బుగ్గల సుందరి ప్రీతిజింటాకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో పలు సినిమాలల్లో నటించింది. తెలుగులో ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు వంటి మూవీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ జీని గుడ్ ఇనఫ్ అనే ఎన్ఆర్ఐ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయింది.
మీరాజాస్మిన్
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించింది ఈ భామ. పందెంకోడి సినిమాతో మీరాజాస్మిన్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దుబాయ్ కి చెందిన అనిల్ జాన్ టైసన్ ను వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయింది మీరా. అనంతరం వీరిద్దరూ విడిపోయి విడాకులు కూడా తీసుకున్నారు.
రంభ
టాలీవుడ్ లోనే సీనియర్ హీరోయిన్గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. అప్పట్లో ఆమె అందానికి కుర్రకారు తెగ ఫిదా అయిపోయారు. దాదాపు ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను అందుకున్నాయి. 2010లో రంభ కెనడాకు చెందిన ఎన్నారై ఇంద్రన్ ను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. వీరికిద్దరు పాపలు, ఓ బాబు ఉన్నారు.
మాధవి
సీనియర్ నటి మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో రగులుతోంది మొగలిపొద పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత మాధవి వ్యాపారవేత్త అయిన రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరు న్యూ జెర్సీలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.
అన్షు అంబానీ
మన్మధుడులో నటించిన మెప్పించిన అన్షు పెళ్లి తర్వాత లండన్ లో ఉంటుంది. ఆమెకు ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం ఈమె క్లాతింగ్ లేబుల్ బిజినెస్ లో రాణిస్తుంది.