Irctc Ticket New Rules: రైల్వే శాఖ రోజుకి లక్షల ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ ఎనలేని సేవలను అందిస్తోంది. ప్రజలు కూడా ఇతర మార్గాల కంటే రైలులో ప్రయాణించేందుకు ఎక్కువ మొగ్గుచూపుతుంటారు. అందుకు అటు ఆఫ్‌లైన్ ( స్టేషన్‌కి నేరుగా వెళ్లి) ఇటు ఆన్లైన్ (ఐఆర్సీటీసీ) ద్వారా బుకింగ్ చేసుకుంటుంటారు. అయితే తాజాగా రైల్వే ప్యాసింజర్లకు షాక్కిస్తూ కొత్త రూల్స్‌ని ప్రవేశపెట్టింది. ఈ నిబంధనల ప్రకారం.. ఇకపై మీ వ్యక్తిగత ఐఆర్సీటీసీ ఐడీ నుంచి ఇతరులకు ట్రైన్ టికెట్లను బుకింగ్ చేసినట్లయితే మీరు ప్రమాదంలో ఇరుక్కున్నట్లే. అసలు రైల్వేశాఖ అమలు చేయనున్న కొత్త రూల్ ఏంటి..
ఇలా టికెట్ బుక్ చేస్తే జైలుకే
గతంలో రైల్వే టికెట్ ఆన్లైన్లో బుక్ చేయాలంటే మన ఐఆర్సీటీసీ అకౌంట్లోనో, లేదా మనకు తెలిసిన, స్నేహితుల IRCTC ఐడీ నుంచి బుక్ చేసుకునే వెసలుబాటు ఉండేది. అయితే తాజాగా ఇండియన్ రైల్వేస్ ఇందులో మార్పులు చేసింది. రైల్వే చట్టం సెక్షన్ 143 ప్రకారం.. కొత్త రూల్స్ ప్రకారం ఇకపై గుర్తింపు పొందిన రైల్వే ఏజెంట్లు మాత్రమే ఇతరులకు ట్రైన్ టికెట్లను బుకింగ్ చేయడానికి అనుమతి ఉంది. మీ IRCTC వ్యక్తిగత ఐడీతో కేవలం మీకు లేదా మీ ఇంటి కుటుంబీకులకు మాత్రమే ( రక్త సంబంధీకులు మాత్రమే ) టికెట్లను బుకింగ్ చేయాలి. (Irctc Ticket New Rules)
అంతేకాకుండా మీ వ్యక్తిగత ఐఆర్సీటీసీ ఖాతాను ఆధార్‌తో లింక్ చేసిన యూజర్‌కు.. గరిష్టంగా నెలకు 24 టికెట్ల, ఆధార్ లింక్ చేయని యూజర్‌కు నెలకు 12 టికెట్లను మాత్రమే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా రైల్వే శాఖ విధించిన పరిమితులకు మించి ట్రైన్ టికెట్లు బుక్ చేయాలంటే రైల్వేశాఖ గుర్తింపు కలిగిన ఏజెంట్లై ఉండాలి. ఈ కొత్త రూల్స్‌ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తెలుస్తోంది. ఒకవేళ వీటిని అతిక్రమిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.10వేల జరిమానా.. కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉంది. కనుక ఐఆర్సీటీస్ ఐడీలు కలిగిన ప్రజలు ఇకపై టికెట్ బుకింగ్ విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది.
అందుకే కొత్త రూల్స్
కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనల ద్వారా రైల్వే టికెట్ రిజర్వేషన్ వ్యవస్థలో జవాబుదారీతనంతో దుర్వినియోగాన్ని నిరోధించడమే లక్ష్యంగా వీటిని అమలులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిబంధన ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రయాణికులు రైల్వే టికెట్లను గరిష్ఠంగా 120 రోజుల ముందే బుకింగ్ చేసుకోవచ్చు. ఇక తత్కాల్ టికెట్లు గమనిస్తే ప్రతి రోజు ఉదయం 10 గంటలకు AC తత్వాల్ బుకింగ్ ప్రారంభం కాగా ఉదయం 11 గంటలకు నాన్ ఏసీ టికెట్లను బుకింగ్ చేసుకొనే అవకాశం ఉంది.