Kaliyugam Pattanam Lo: నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో ‘కలియుగం పట్టణంలో’ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ ప్రధాన పాత్రలు పోషించారు. సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, డైరెక్షన్ రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు నిర్మించిన ఈ సినిమా మార్చి 29న ధియేటర్లలోకి రానుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు కలియుగం పట్టణంలో ప్రమోషన్స్ కార్యక్రమంలో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఇందులో నటించిన ప్రముఖ నటుడు నరేన్ రామ మీడియాతో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ఈ మూవీలో నటించిన నరేన్ రామ సీనియర్ నటుడు గుమ్మడి బంధువు.. వరుసకు తాతయ్య వరుస . ఈ క్రమంలో నరేన్‌కు మొదట్నుంచి సినిమాల మీద ఆసక్తి వచ్చింది. నరేన్ తల్లి తండ్రులు తెలుగు వాళ్లే అయినప్పటికీ .. చెన్నైలో స్థిరపడ్డారు. దీంతో అక్కడ నరేన్ కోలీవుడ్ పరిశ్రమలో సినీ ప్రయత్నాలు ప్రారంభించాడు.ఈ క్రమంలో నరేన్ పలు యాడ్స్ చేసిన నరేన్ తమిళంలో మూడు సినిమాలు హీరోగా, ఒక సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు. త్వరలో రాబోతున్న కలియుగం పట్టణంలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో నరేన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
నేను ఛాన్సుల కోసం వెతుకుతుండగా ఈ సినిమా కో డైరెక్టర్, నా వెల్ విషర్ సాయి అన్న నన్ను పిలిచి ఈ ఆఫర్ ఇప్పించారు. డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి నా ప్రొఫైల్ చూసి ఓకే చేసారు. నా పాత్ర బాగుంటుంది. నాకు కథ నచ్చింది. అందుకే ఈ సినిమా చేసాను. ఆయనతో ఇంకా వర్క్ చేయాలని ఉంది.
ఈ చిత్రంలో హీరోగా నటించిన విశ్వ కార్తికేయ గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం హీరోగా చేస్తున్నాడు. నాకు వర్క్ విషయంలో అతను చాలా సహాయం చేసాడు. మేమిద్దరం డిస్కస్ చేసుకొని సెట్స్‌లో యాక్ట్ చేసేవాళ్ళము హీరోయిన్ అయుషీ మంచి అమ్మాయి. తనతో ఎక్కువ ర్యాపో లేదు. బట్ కలిసినప్పుడు కూల్ గా మాట్లాడతారు.
ఇది ఒక థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కడంతో ప్రేక్షకులు ఈ మూవీని థియేటర్ లో చూసి తప్పక ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. సినిమా చూసి నచ్చిన వాళ్ళు ఇంకొంతమందికి చెప్పండి. అందరికి రీచ్ అవుతుంది. మేజర్ సిటీలలో కాలేజీ టూర్స్ కి వెళ్ళాము. అని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ వచ్చి చూస్తారని భావిస్తున్నాం. ఈ మూవీ అనంతరం నరేన్ రామ త్వరలో WHO అనే చిత్రంతో రానున్నారు. తమిళంలో కొన్ని మూవీస్ చేతిలో ఉన్నాయి.