Harshit Rana Over Action Goes Viral: ఐపీఎల్-2024 సందడి మొదలైంది. ఈ సీజన్ ప్రారంభమై ఇప్పటికి రెండు మ్యాచ్‌లు కాగా..రెండూ వన్‌సైడ్ మ్యాచ్ తరహాలో జరిగాయనే చెప్పాలి. శనివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్ వెర్సెస్ కోల్కత్త నైట్ రైడర్స్ మ్యాచ్ మాత్రం చివరి బంతి వరకు విజయం ఎవరిని వరిస్తుందో తెలియక ఆడియన్స్‌కు కావాల్సినంత ఫన్‌తో పాటు నరాలు తెగే ఉత్కంఠతకు గురి చేసింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభంలో కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానా చేసిన ఓవరాక్షన్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
గెలవాల్సిన మ్యాచ్.. మా ఓటమికి అతడే కారణం: సన్‌రైజర్స్ కెప్టెన్
రానా బౌలింగ్‌లో బాదేశారు
కేకేఆర్ మొదటగా బ్యాటింగ్ చేసి తక్కువ స్కోరుకే కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో టార్గెట్ 170 లోపు ఉంటుందని అందరూ భావించారు. కానీ క్రీజులోకి వచ్చిన ఆండ్రూ రస్సెల్ తన బ్యాటింగ్‌తో రఫ్పాడించాడు. మ్యాచ్ స్వరూపాన్ని మార్చి హైదరాబద్ ముందు 209 భారీ లక్ష్యాన్ని ఉంచాడు. బిగ్ టార్గెట్ చేధించేందుకు బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ ఆచితూచి ఆడుతూ జట్టుకు మంచి అరంభాన్ని ఇచ్చారు. మధ్య మధ్యలో బౌండరీలు బాదుతూ రన్‌రేట్‌ని పెంచుతూ వీరిద్దరూ బ్యాటింగ్ కొనసాగించారు.
అయితే ఈ క్రమంలో మొదటి స్పెల్ వేసిన కేకేఆర్ బౌలర్ హర్షిత్ రానాను (Harshit Rana) అగర్వాల్ టార్గెట్ చేశాడు. తొలి ఓవర్ నుంచే అతడి బౌలింగ్ ధీటుగా ఎదుర్కుంటూ.. బంతులను బౌండరీలకు తరలించాడు. ఈ నేపథ్యంలో రానా కాస్త ఒత్తడిలో కూడా వెళ్లాడు. రానా బౌలింగ్‌లో అప్పటికీ భారీగా పరుగులు వచ్చాయి. మరో పక్క హైదరాబాద్ ఓపనర్లు ధీటుగా ఆడుతున్నారు. అయితే కేకేఆర్ కెప్టెన్ అయ్యర్ మాత్రం పవర్ ప్లేలోనే రానా మీద నమ్మకంతో మరో సారి ఓవర్ వేసే అవకాశం అతనికే ఇచ్చాడు.
అంత అవసరమా
ఆరో ఓవర్ వేసిన రానా బౌలింగ్‌లో మొదటి రెండు బంతులతో బౌండరీలు రాలేదు. దీంతో మయాంక్ భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి నేరుగా వెళ్లి రింకూ సింగ్ చేతికి చిక్కడంతో సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. దీంతో తొలి వికెట్ తీసిన ఆనందంలో రానా.. మయాంక్ పెవిలియన్‌గా వెళ్తుండగా.. అతడిని చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఈ క్రమంలో రానాని యాక్షన్‌ను చూసి.. మయాంక్ కూడా అతడి వైపు సీరియస్‌గా చూస్తూ వెళ్లిపోయాడు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఈ వీడియో చూసి.. అంతలా ఓవరాక్షన్ అవసరమా…కాస్త తగ్గించుకో బ్రో, అని కొందరు, వికెట్ తీసిన ఆనందం వరకు ఓకే గానీ ఇలా రెచ్చగొట్టేవి చేయడం సమంజసం కాదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
A flying kiss by Harshit Rana to Mayank Agarwal as a send off.pic.twitter.com/LVkQYKmisZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024