Lambasingi Movie Success Meet: కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్ పై మార్చి 15న లంబసింగి మూవీ రిలీజైన సంగతి తెలిసిందే. భారత్ రాజ్, బిగ్ బాస్ బ్యూటీ దివి హీరో హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి నవీన్ గాంధీ దర్శకత్వం వహించగా, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కి చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
((దీనిపై ఓ లుక్కేయండి: రవితేజ మూవీ.. సడన్‌గా అలా అనేసరికి బాత్రూంకి వెళ్లి ఏడ్చేశాను! ))
ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ..
మీడియా సభ్యులకు ధన్యవాదాలు, మా సినిమాకు మీరు ఇచ్చిన రివ్యూస్ చాలా బాగున్నాయి. నేను ఒక దర్శకుడిగా ఉంటూ ఇంకో దర్శకుడితో సినిమా చెయ్యడానికి కారణం ఏంటంటే.. పరిశ్రమలో టాలెంట్ ఉండి కూడా అవకాశాలు రాక చాలా మంది ఉన్నారు.., నేను కూడా అలా అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అందుకే నేను కొందరికైనా అవకాశం ఇద్దామని ఉద్దేశ్యంతో సినిమా నిర్మాణంలో అడుగు పెట్టానని చెప్పుకొచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్షన్ చెయ్యడానికి నాకు ఏడేళ్లు పట్టింది.
ప్రతిరోజు రేపే షూటింగ్ అనుకుంటూ గడిపే నాకు నాగార్జున సార్ అవకాశం ఇచ్చారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇండస్ట్రీలో దివి లాంటి చాలా మంది తెలుగు అమ్మాయిలందరికీ అవకాశాలు రావాలి. ఈ మూవీలో భారత్ రాజ్,దివి అద్బతంగా నటించారు. నవీన్ గాంధీ ఈ కథను అనుకున్న విధంగానే తెరకెక్కించి.. మంచి ఔట్‌పుట్‌ని వచ్చేలా కష్టపడ్డారు. ఆర్.ఆర్.ధ్రువన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.. ఈ మూవీలోని మ్యూజిక్ వింటే మీకే అర్థమవుతుంది. లంబసింగి మూవీని అందరూ చూసి ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.ఆర్.ధ్రువన్ మాట్లాడుతూ…
లంబసింగి సినిమా నాకు చాలా స్పెషల్, సాంగ్స్ బాగున్నాయని అందరూ అంటున్నారు. సినిమా చూసి వచ్చిన ప్రతిఒక్కరు ఎమోషనల్ అయ్యారు. కళ్యాణ్ కృష్ణ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్, ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్ లో చాలా నేర్చుకున్నాను అన్నారు.
నటుడు మాధవ్ చిలుకూరి .. .
సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంది ఆదరణ లభిస్తోంది. దివి, భారత్ చాలా సహజంగా నటించారు .చేశారు. ఒక మంచి లవ్ స్టొరీని అందంగా చూపించారు డైరెక్టర్ నవీన్ గాంధీ. ఈ చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉందన్నారు.
దర్శకుడు నవీన్ గాంధీ మాట్లాడుతూ…
లంబసింగి మూవీ స్టోరీ రాసినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో .. మూవీ చూసిన ఆడియన్స్ అలానే ఫీల్ అవుతూ… బరువైన హృదయంతో బయటికి వస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ నన్ను నమ్మి ఈ చిత్రం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ మూవీకి సపోర్ట్ చేసిన జీ.కె.మోహన్ థాంక్స్ చెప్పాల్సిందే.. ఇక డైరెక్షన్ డిపార్ట్మెంట్ , మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్, ఆర్ట్ ఝాన్సీ ఇలా అందరూ లంబసింగి కోసం ది బెస్ట్ ఇచ్చారనే చెప్పాలి.
హీరోయిన్ దివి మాట్లాడుతూ…
ఈ మూవీ దర్శకులు కళ్యాణ్ కృష్ణ ఒక తెలుగు అమ్మాయి కావాలని నన్ను ఎంపిక చేసుకోవడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. లంబసింగి మూవీలో హీరోయిన్గా అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌కి స్పెషల్ థాంక్స్,.. అలాగే ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ఛాన్సలు ఇవ్వండి, గుర్తించండి, మేము కూడా కష్టపడి మా టాలెంట్‌ను నిరూపించుకుంటాం. నవీన్ గాంధీ ఈ మూవీని అద్భుతంగా తీశారు. ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అదిరిపోయిందని చెప్పారు
హీరో భారత్ రాజ్ మాట్లాడుతూ…
కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ఒక చిన్న రోల్ చెయ్యాలని అనుకున్నాను. అలాంటిది ఆయన నిర్మాతగా చేసే సినిమాలో హీరోగా నటించడం ఆనందంగా ఉంది. లంబసింగి మూవీలో ప్రధానంగా మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు, ఈ క్రెడిట్ మొత్తం ఆర్.ఆర్.ధ్రువన్కే దక్కుతుంది చెందుతుంది, నవీన్ గాంధీ మూవీని తెరకెక్కించిన తీరు బాగుంది. వీరవాబు పాత్రను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.