Lambasingi Movie Trailer: సమ్మర వస్తే చాలా చల్లటి ప్రదేశాలకు వెళ్లాలని తపించుపోతుంటాం. అందుకే సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేషన్స్‌కు ట్రిప్ వేసేందుకు ప్లాన్ చేసుకుంటుంటారు. ఎందుకంటే… వేసవి వేడి నుంచి తప్పించుకుని కాస్త కూల్‌గా అవ్వడంతో పాటు ఇంకాస్త రిలాక్స్ అవ్వచ్చు కాబట్టి. మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అదే ఆంధ్రా కశ్మీర్‌గా పేరొందిన ‘లంబసింగి’. ఇప్పుడు ఆ గ్రామంలో జరిగిన ఒక ప్రేమ కథ సినిమాగా రూపొంది ప్రేక్షకుల ముందుకు రానుంది.
కళ్యాణ్ కృష్ణ కురసాల ‘లంబసింగి’ మూవీతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్ రాజ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఉపశీర్షికగా ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’ అని జోడించారు.
ఇటీవల ఈ చిత్రం నుంచి పాటలు రిలీజ్ చేయగా “నచ్చేసిందే.. డోలారే… వయ్యారి గోదారి సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభించింది. తాజాగా లంబసింగి మూవీ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ… కళ్యాణ్ కృష్ణ సినిమా చేస్తున్నాడు అంటే నా సొంత సినిమాల అనిపించింది.
ఈ మూవీ ట్రైలర్ చూశాను.. బాగుంది, సన్నివేశాల తెరకెక్కించిన తీరు, అలానే అందమైన లొకేషన్స్ లో సినిమాను షూట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. దర్శకుడు నవీన్ గాంధీ ఒక అందమైన ప్రేమకథను లంబసింగి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం దివికి అలాగే భరత్ రాజ్‌కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను. మార్చి 15న ఆడియన్స్ ముందుకు రాబోతున్న లంబసింగి సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు. భరత్ రాజ్, దివి, వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్, ప్రమోద్, రమణ, పరమేష్ తదితరులు నటించారు.
సాంకేతిక నిపుణులు:
సమర్పణ: కళ్యాణ్ కృష్ణ కూరసాల
కథ, మాటలు ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం: నవీన్ గాంధీ
నిర్మాత: ఆనంద్.టి
బ్యానర్: కాన్సెప్ట్ ఫిలింస్
కెమెరామెన్: కె.బుజ్జి
సంగీతం: ఆర్ఆర్.ధ్రువన్
ఎడిటర్: కె.విజయ్ వర్ధన్
లిరిక్స్: కాసర్ల శ్యామ్