Layoffs: ఉద్యోగుల తొలగింపు అంటే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది ఐటీ రంగమే. ఇటీవల ఈ రంగంలో పని చేస్తున్న చాలా మంది అకస్మాత్తుగా పింక్ స్లిప్‌లు తీసుకుని జాబ్‌లను కోల్పోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సెగ మీడియా రంగానికి కూడా తగలినట్లు ఉంది. ప్రముఖ మీడియా, టెలివిజన్ దిగ్గజ సంస్థ సీబీఎస్ (CBS) న్యూస్‌ను కలిగి ఉన్న అమెరికన్ మీడియా గ్రూప్ పారామౌంట్ గ్లోబల్ తన సిబ్బంది పై లేఆఫ్ కొరడా ఝుళిపిస్తూ షాక్ ఇచ్చింది.
ఈ నిర్ణయంతో అందులో పని చేస్తున్న దాదాపు 800 మందికి పైగా ఉద్యోగులు ఇంటి బాట పట్టనున్నారు. ఈ మొత్తం కంపెనీ ఉద్యోగుల్లో 3 శాతానికి సమానంగా తెలుస్తోంది. ఈ కీలక విషయాన్ని పారామౌంట్ సీఈవో బాబ్ బకిష్ కంపెనీ అంతర్గత మెమో ద్వారా ప్రకటించారు.
(( దీనిపై ఓ లుక్కేయండి: సామాన్యులకు శుభవార్త.. అదిరిపోయేలా కొత్త స్కీం.. 300 యూనిట్ల ఉచిత కరెంట్! ))
ఊహించన షాక్..
ఆదివారం నాడు కాన్సాస్ సిటీ చీఫ్స్, శాన్ ఫ్రాన్సిస్కో మధ్య వార్షిక లీగ్ చాంపియన్‌షిప్ ప్రసారాన్ని అత్యధికంగా వీక్షించారు. ఈ ప్రసారాన్ని దాదాపు 123.4 మిలియన్ల మంది వీక్షించినట్లు ప్రకటించిన కొద్ది గంటల తర్వాత అందరికీ షాక్కిస్తూ ఈ సంస్థలో ఉద్యోగుల తొలగింపు(Layoffs) గురించి వార్తలు వచ్చాయి.
అంతర్గత మెమోలో ఈ రకంగా రాసి ఉన్నట్లు తెలిపింది. అందులో.. కంపెనీ వీడిపోతున్న వారికి ధన్యవాదాలు. “మీ ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా మంచి కంటెంట్‌ని ప్రజలకు చేరవేస్తూ మా మిషన్‌ను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడింది. మీ కృషి, అంకితభావానికి మేము చాలా కృతజ్ఞులమని చెప్పుకొచ్చారు.
“ఈ మార్పులు ఏ విధంగానూ సులభం కాదని నాకు తెలుస్తోంది…అయితే ఇది సంస్థ భవిష్యత్తుకు సరైన నిర్ణయం అని నేను నమ్ముతున్నాను. ప్రస్తుతం చేస్తున్న సర్దుబాట్లు ద్వారా రాబోయే సంవత్సరానికి యాజమాన్యం వ్యూహాత్మకంగా తీసుకోబోయే నిర్ణయాలను అమలు చేయడంలో ఇది సహాయపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
దాని కోసమే ఈ తొలగింపు
పారామౌంట్ గ్లోబల్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచుకోవడానికి తన ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకున్నట్లు ABC7 చికాగో తన నివేదికలో వెల్లడించింది. పారామౌంట్ పిక్చర్స్ మూవీ స్టూడియోతో పాటు, MTV, కామెడీ సెంట్రల్, నికెలోడియన్, బ్రిటన్ ఛానల్ 5తో సహా TV నెట్‌వర్క్‌లను పారామౌంట్ గ్లోబల్ కలిగి ఉంది. వీటితో పారామౌంట్+ ప్లూటో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. 37 దేశాలలో దాదాపు 24,500 మంది పార్ట్ టైం, ఫుల్‌టైం ఉద్యోగులు ఈ సంస్థలో పని చేస్తున్నారు.