Mahesh Babu: మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన గుంటూరు కారం మూవీతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందనను అందుకుంది. అయితే మహేశ్ వన్ మ్యాన్ షో కారణంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఈ మూవీ తర్వాత మహేష్- దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మించనున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు కొత్త కొత్త లుక్స్‌లో కనపడిన ప్రిన్స్ మరోసారి ఊహించని రేంజ్లో మరో అవతారమెత్తాడు. ప్రస్తుతం ఈ లుక్‌కి సూపర్ స్టార్ అభిమానులు ఫిదా అవుతున్నారు.
((దీనిపై ఓ లుక్కేయండి: నిర్మాతలకు ఇలానే చెబుతా.. రెమ్యునరేషన్ పెంపు వార్తలపై అదిరిపోయే రిప్లై!))
దిల్ రాజు తమ్ముడు కొడుకుకి పెళ్లి నిశ్చయమైంది. జైపూర్‌లో ఈ వివాహం ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఫ్యామిలీ పలువురు సెలబ్రిటీలను కలిసి వారికి శుభలేఖలు అందజేస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మోహన్ బాబు, రామ్ చరణ్ తదితరులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ క్రమంలోనే దిల్ రాజు మహేష్ బాబు(Mahesh Babu) ఫ్యామిలీని పెళ్లికి పిలిచేందుకు ఇంటికి వెళ్లారు. అనంతరం మహేష్, నమ్రతలతో ఫోటో దిగి వాటిని షేర్ చేయగా.. ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్
ఈ ఫోటోలలో మహేష్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇందులో జుట్టు, గడ్డం కూడా బాగా పెంచుతున్నట్టు కనిపిస్తోంది. సాధారణంగా ప్రిన్స్ హెయిర్, గడ్డంతో తక్కువగా కనిపిస్తాడు. అలాంటిది తాజాగా ఇలా మారడంతో రాజమౌళి మూవీ కోసమే అంటూ నెటిజెన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు. జక్కన్న గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. సినిమా విషయంలో , హీరోల క్యారెక్టరైజేషన్, ఇలా ప్రతీ దానిలో టాప్ రేంజ్లో ఉండాలనుకుంటాడు. అలాంటిది తాజాగా మహేష్ లుక్ చూసి SSMB29 మూవీలో తమ అభిమాన హీరోని ఎలా చూపిస్తారో అని ఎదరుచూస్తున్నారు.
మూవీ డీటైల్స్
రాజమౌళి – మహేష్ కాంబోలో మూవీ రానుందని ఎప్పుడైతే న్యూస్ బయటకొచ్చిందో అప్పటినుండి ఫ్యాన్స్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం ప్రాజెక్ట్ విషయంలో ఎక్కువ టైం తీసుకోవడం, నిదానమే ప్రధానమే అన్న కాన్సెప్ట్ తో.. ఆచితూచి అడుగేస్తుంటాడు. ఎంత ఆలస్యమైనా సరే తాను అనుకున్నది అనుకున్నట్టుగా ఏమాత్రం రాజీ పడకుండా సినిమాని తెరకెక్కిస్తాడు. కాబట్టి అప్డేట్ల విషయంలోనూ కాస్త ఆలస్యంగా అవ్వచ్చు. RRR వరల్డ్ వైడ్ క్రేజ్ ను సొంతం చేసుకున్న రాజమౌళి.. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇండియానా జోన్స్ సినిమాకి ఇన్స్పిరేషన్గా తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.